Kane – Tim : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి 100 టెస్టుల వ‌ర‌కు.. కేన్ విలిమ‌య్స‌న్‌, టీమ్ సౌథీల ప్ర‌యాణం

న్యూజిలాండ్ క్రికెట‌ర్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ లు అరుదైన ఘ‌నత సాధించారు.

Kane – Tim : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి 100 టెస్టుల వ‌ర‌కు.. కేన్ విలిమ‌య్స‌న్‌, టీమ్ సౌథీల ప్ర‌యాణం

Kane Williamson and Tim Southee celebrate landmark 100th Test caps against Australia

Updated On : March 8, 2024 / 5:28 PM IST

Kane Williamson -Tim Southee : న్యూజిలాండ్ క్రికెట‌ర్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ లు అరుదైన ఘ‌నత సాధించారు. క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ ద్వారా దీన్ని వీరు అందుకున్నారు. వీరిద్ద‌రికి ఇది వందో టెస్టు కావ‌డం విశేషం. కాగా.. వీరిద్ద‌రు 2008 అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఆడే రోజుల ద‌గ్గ‌ర నుంచి క‌లిసి ఆడుతుండ‌డం గ‌మ‌నార్హం. కాగా.. 2008లో సౌథీ సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్ట‌గా, రెండున్న‌రేళ్ల ఆల‌స్యంగా 2010లో విలియ‌మ్స‌న్ అరంగ్రేటం చేశాడు.

కివీస్ త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా విలియ‌మ్సన్ కొన‌సాగుతుండ‌గా.. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో న్యూజిలాండ్ బౌలర్‌గా టిమ్ సౌథీ ఉన్నాడు. ఇక వీరిద్ద‌రు 2011, 2015, 2019, 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో క‌లిసి ఆడారు. చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులైన ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఒక‌రికి మ‌రొక‌రు అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. వీరి కంటే ముందు నలుగురు న్యూజిలాండ్ ఆట‌గాళ్లు మాత్ర‌మే వంద టెస్టులకు పైగా ఆడారు.

IND vs ENG 5th Test : ధ‌ర్మ‌శాల‌లో ప‌ట్టుబిగిస్తోన్న భార‌త్‌.. ముగిసిన రెండో రోజు ఆట‌

ఒకే జట్టు తరఫున, ఒకే మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు వందో టెస్టు ఆడటం క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది మూడోసారి మాత్ర‌మే. ఇంగ్లాండ్‌కు చెందిన మైకెల్ ఆథర్‌టన్, అలెక్‌ స్టెవార్ట్, ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు షాన్ పోలాక్, జాక్వెస్ కలిస్ లు ఇంత‌క‌ముందు ఈఘ‌న‌త‌ను సాధించారు. వందో టెస్ట్ సందర్భంగా విలియమ్సన్, సౌథీలకు సహచర ఆటగాళ్లు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌తో పాటు ప‌లువురు క్రికెట‌ర్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

కేన్ మామ విఫ‌లం..

వందో టెస్టు ఆడుతున్న కేన్ మామ తొలి ఇన్నింగ్స్‌లో విఫ‌లం అయ్యాడు. 37 బంతులు ఎదుర్కొని 17 ప‌రుగుకే చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవ‌ర్ల‌లో 162 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బౌల‌ర్ల‌లో జోష్ హేజిల్‌వుడ్ ఐదు వికెట్ల‌తో కివీస్ ప‌త‌నాన్ని శాసించ‌గా మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు.

Sarfaraz Khan : మార్క్‌వుడ్ స్లెడ్జింగ్‌..! అప్ప‌ర్ క‌ట్‌తో స‌ర్ఫ‌రాజ్ స‌మాధానం.. వీడియో వైర‌ల్‌

అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 4 వికెట్లు కోల్పోయి 124 ప‌రుగులు చేసింది. మార్న‌స్ లబుషేన్ (45), నాథ‌న్ లియోన్ (1) లు క్రీజులో ఉన్నారు. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆసీస్ ఇంకా 38 ప‌రుగుల దూరంలో ఉంది.