IND vs ENG 5th Test : ధర్మశాలలో పట్టుబిగిస్తోన్న భారత్.. ముగిసిన రెండో రోజు ఆట
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టుబిగిస్తోంది.

IND vs ENG 5th Test
IND vs ENG : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 218 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. తన మొదటి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా (19), కుల్దీప్ యాదవ్ (27) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 255 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Stumps on Day 2 in Dharamsala!#TeamIndia extend their first-innings lead to 255 runs as they reach 473/8 ??
Kuldeep Yadav & Jasprit Bumrah with an unbeaten 45*-run partnership ?
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/6gifkjgSKJ
— BCCI (@BCCI) March 8, 2024
ఓవర్ నైట్ స్కోరు 135/1తో రెండో రోజు ఆటను భారత్ ఆరంభించింది. ఓవర్ నైట్ బ్యాటర్లు రోహిత్ శర్మ52, శుభ్‌మన్ గిల్ 26 పరుగులతో ఆటను ప్రారంభించారు. ఇంగ్లాండ్ బౌలర్ల పై ఎదురుదాటికి దిగారు. వీరిద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదాడు. రోహిత్ శర్మ తనవైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించారు. ఇద్దరూ పోటీపడి బౌండరీలు కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. టామ్ హార్డ్లీ బౌలింగ్‌లో సింగిల్ తీసి రోహిత్ శర్మ 154 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది 12వ శతకం కాగా.. ఈ సిరీస్‌లో రెండోది.
ఆ మరుసటి ఓవర్‌లోనే షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి శుభ్‌మన్ గిల్ 138 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టుల్లో గిల్‌కు నాలుగో సెంచరీ కాగా ఈ సిరీస్‌లో రెండోది కావడం విశేషం. అయితే.. లంచ్ విరామం తరువాత రోహిత్ శర్మ (103; 162 బంతుల్లో 13 ఫోర్లు, 3సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (110; 150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) లు స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. రోహిత్‌ను బెన్‌స్టోక్స్ బౌల్డ్ చేయగా అండర్సన్ బౌలింగ్‌లో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ దశలో అరంగ్రేట ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ (65; 103 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ (56; 60 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్) ఇంగ్లాండ్ బౌలర్లను ఆడుకున్నారు. ఇద్దరూ స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ 55 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. మరికాసేపటికే షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 376 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆడుతున్నది మొదటి టెస్టు మ్యాచే అయినప్పటికీ ఓ అనుభవం ఉన్న ఆటగాడిలా పడిక్కల్ బ్యాటింగ్ చేశాడు. 83 బంతుల్లో టెస్టుల్లో తన తొలి అర్ధశతకాన్ని అందుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో బషీర్ బౌలింగ్‌లోనే పడిక్కల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Also Read: శతక్కొట్టిన రోహిత్ శర్మ.. సెంచరీ నంబర్ 48.. జోరూట్ రికార్డ్ బ్రేక్..
ఈ సమయంలో రవీంద్ర జడేజా (15), ధ్రువ్ జురెల్ (15), రవిచంద్రన్ అశ్విన్ (0) లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావంతో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అయితే.. కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా లు జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడనీయకుండా రెండో రోజును ముగించారు. వీరిద్దరు అభేద్యమైన తొమ్మిదో వికెట్‌ను 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు తీశాడు. టామ్ హార్ల్డీ రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్‌లు చెరో వికెట్ సాధించారు.