ఫుల్ ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తా.. ఇంగ్లండ్‌తో టెస్టు ఆడుతా : విలయమ్సన్

  • Published By: sreehari ,Published On : November 9, 2019 / 11:06 AM IST
ఫుల్ ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తా.. ఇంగ్లండ్‌తో టెస్టు ఆడుతా : విలయమ్సన్

Updated On : November 9, 2019 / 11:06 AM IST

తుంటి గాయంతో ఆటకు దూరమైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయమ్సన్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. త్వరలో ఫుల్ ఫిట్ నెస్ తో కోలుకుని తిరిగి జట్టులోకి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. గాయం కారణంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు విలియమ్సన్ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో బ్లాక్ క్యాప్స్ జట్టు పగ్గాలను టిమ్ సౌథీ అందుకున్నాడు. 

నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇలోగా గాయం నుంచి పూర్తిగా కోలుకుని టెస్టు సిరీస్ ఆడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.  ‘నిజానికి.. తుంటి గాయం నయం అవుతోంది. నెమ్మదిగా సర్దుకుంటోంది. కొన్ని నెలలుగా పునరావసంలోనే చికిత్స తీసుకున్నాను. ఈ సిరీస్ లో తొలి టెస్టుకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ట్రైనింగ్ జరుగుతోంది. మనస్సులో ఎన్నో ఆలోచనలు.. సరైన సమయంలో ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. అందుకు తగినట్టుగా సిద్ధం అవుతున్నా’ అని అన్నాడు.
 
ప్రస్తుతం.. ఐదు మ్యాచ్ ల అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2-2తో సమంగా ముగిసింది. ఈ ఆదివారం జరుగబోయే మ్యాచ్ సిరీస్ విజేత ఎవరో నిర్ణయించనుంది. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు బే ఓవ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. రెండో టెస్టు మ్యాచ్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు సీడాన్ పార్క్ వేదికగా జరుగనుంది.