IPL 2020: ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరు జరగనుంది. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) తలపడనుంది. 3 మ్యాచ్‌లు, ఓ విక్టరీ, సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో.. ఊహించని పరాజయం.
ఈ సీజన్‌లో ముంబై, పంజాబ్ జట్ల పరిస్థితి ఇది. రెండు టీమ్‌ల సిచ్యువేషన్ ఒకేలా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో.. సూపర్ ఓవర్‌లో ముంబై ఓడగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సూపర్ ఓవర్‌లో పంజాబ్ ఓటమిపాలైంది. దీంతో.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని రెండు జట్లు కసిగా ఉన్నాయి.
ఇక.. హెడ్ టు హెడ్ పోరులో పంజాబ్‌పై.. ముంబైదే పైచేయిగా ఉంది. రెండు జట్లు 24 సార్లు తలపడగా.. ముంబై 13 సార్లు, పంజాబ్ 11 సార్లు గెలిచింది.
లాస్ట్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడిపోవడం.. ముంబై ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అయితే బెంగళూరుతో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఇరగదీశాడు. పొలార్డ్ కూడా సూపర్ ఫామ్‌లోకి రావడం ముంబైకి ప్లస్‌గా మారింది.
రోహిత్ కూడా నిలకడగా ఆడితే.. ముంబై బ్యాటింగ్‌కు తిరుగుండదు. మరోవైపు హార్దిక్ పాండ్య.. వరుసగా మూడు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. బౌలింగ్‌లో కూడా ముంబై ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. డెత్ ఓవర్లలో బుమ్రా..
ఇంతకుముందులా రాణించకపోవడం టీమ్‌ను కలవరపెడుతోంది.
మరోవైపు పంజాబ్ బౌలింగ్ కూడా వీక్‌గా కనిపిస్తోంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 224 పరుగుల భారీ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది. తెవాతియా దెబ్బకు పేసర్ కాట్రెల్ వణికిపోయాడు. అయితే.. షమీ సూపర్ ఫామ్‌లో ఉండటం కాస్త కలిసొచ్చే అంశం.
స్పిన్నర్ బిష్ణోయ్ కూడా మంచి ఎకానమీతో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌లో మయాంక్, రాహుల్ ఇరగదీసే ఫామ్‌లో ఉన్నారు. మరోసారి వీళ్లిద్దరూ.. క్రీజులో నిలబడితే భారీ స్కోర్ ఖాయం. టోర్నిలో ఒత్తిడి లేకుండా ముందుకెళ్లాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది.