KKR vs CSK : త్రిపాఠి మెరుపులు.. చెన్నై లక్ష్యం 168 పరుగులు

  • Publish Date - October 7, 2020 / 09:39 PM IST

ఐపీఎల్ సీజన్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో ప్రత్యర్థి జట్టు చెన్నైకు కోల్ కతా 168 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.




టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా ఓపెనర్లుగా బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్ లు బాదిన త్రిపాఠి.. 81 పరుగులతో హాఫ్ సెంచరీ దాటేశాడు.




ఆది నుంచి నిలకడగా ఆడుతూ జట్టు స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కానీ, ఒక దశలో చెన్నై బౌలర్ బ్రావో బౌలింగ్ లో వాట్సన్ కు క్యాచ్ ఇచ్చి త్రిపాఠి ఇన్నింగ్స్ కు బ్రేక్ పడింది. మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ పేలవ ప్రదర్శనతో (11) పరుగులకే పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (12) సహా గిల్ (11), నరైన్ (17), రాణా (9), మోర్గాన్ (7), రసెల్ (2), కమిన్స్ (17 నాటౌట్), వరుణ్ (1) ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు.



పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లు బౌలింగ్ కట్టుదిట్టం చేయడంతో కోల్ కతా 167 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో కరన్, థాకూర్, శర్మ తలో రెండు వికెట్లు తీసుకోగా, బ్రావో ఏకంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై బౌలర్ల మాయతో కోల్ కతాను కట్టడి చేయడంతో స్వల్ప స్కోరుకే పరిమితమై ఆలౌట్ అయింది.