KKRvDC: ఢిల్లీ టార్గెట్ 179

KKRvDC: ఢిల్లీ టార్గెట్ 179

Updated On : April 12, 2019 / 4:46 PM IST

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ దూకుడైన ఆటతో ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా టార్గెట్ అధికంగా ఇవ్వాలనే ప్రయత్నంలో హిట్టింగ్ కనబరిచింది. జట్టులో మార్పులు చేసుకుని బరిలోకి దిగిన కోల్‌కతా శుభ్ మాన్ గిల్ (65; 39బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు)తో జట్టు హైస్కోరర్ గా నిలిచాడు. 

మరో బ్యాట్స్ మన్ ఆండ్రీ రస్సెల్(45; 21 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సులు)తో రాణించడంతో కోల్‌కతా స్కోరు పరుగులు పెట్టింది.  జో డెన్లీ(0), రాబిన్ ఊతప్ప(28), నితీశ్ రానా(11), దినేశ్ కార్తీక్(2), కార్లొస్ బ్రాత్ వైట్(6), పీయూశ్ చావ్లా(14), కుల్దీప్ యాదవ్(2)పరుగులు చేయగలిగారు. 

ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ దక్కించుకోగా, క్రిస్ మోరిస్, కగిసో రబాడ, కీమో పాల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.