ద్రవిడ్ సలహాలే ఫామ్‌ను తెచ్చిపెట్టాయి: కేఎల్ రాహల్

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైయ్యాడు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో వరుస స్కోర్లు 2, 44, 2, 0, 9గా పూర్తి నిరాశపరిచాడు. దీంతో పూర్తిగా ఫామ్ కోల్పోయిన రాహుల్‌ను సొంతగడ్డపై ఆస్ట్నేలియాతో ఆడించడం వృథా అనే భావించారంతా.. జట్టు కూర్పుపై సందేహాలు మొదలయ్యాయి.
Read Also:భారత్‌పైకి మరోసారి పాక్ యుద్ధ విమానాలు
కానీ, ఫిబ్రవరి 24 ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 35బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రాహుల్, రెండో టీ20 ఫిబ్రవరి 27న అదే స్థాయిలో అదరగొట్టాడు. 26బంతుల్లో 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. అసలు ఈ గ్యాప్‌లో రాహుల్ ఏం చేశాడు. వివాదాల్లోకి ఇరుక్కుని బయటకు వచ్చిన రాహుల్.. తిరిగి ఫామ్ ఎలా దక్కించుకున్నాడని ఆలోచిస్తే..
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత రాహుల్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కకు పెట్టేసింది. ఇండియా ఏ జట్టుకు అప్పగించింది. ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెట్ ద్రవిడ్.. కేఎల్ రాహుల్‌ను సాన బెట్టాడు. తిరిగి ఫామ్ దక్కేలా చేశాడు. రెండు అనధికారిక టెస్టులకు ఇండియా ఏ జట్టులో ఆడి వరుసగా 89, 81 పరుగులు చేయడంతో టీమిండియాలోకి మళ్లీ పిలుపొచ్చింది.
Read Also : ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ : సముద్రంలో పెట్రోలింగ్
‘ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి విరామం రాగానే భారత్‌కు వచ్చేశా. నా ఆటలో లోపాలను సరిచేసుకున్నా. అదృష్టవశాత్తు ఇండియా ఏ గేమ్స్ అందుకు బాగా ఉపయోగపడ్డాయి. ఒత్తిడి తక్కువ ఉండటంతో నా నైపుణ్యాలపై ఫోకస్ చేయడం సాధ్యపడింది. రాహుల్ ద్రవిడ్‌తో చాలా సమయం గడిపేందుకు అవకాశం దొరికింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ లో ఆడడం బాగా కలిసొచ్చింది’ అని రాహుల్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
సొంతగడ్డపై ఆస్ట్ర్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్.. తొలి సిరీస్ అయిన టీ20ని 0-2తో కోల్పోయింది. మార్చి2 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఆడి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
Read Also : అభినందన్ పాక్ బోర్డర్‌లో దిగగానే ఏం జరిగింది?