IPL 2022: కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా లక్నో జట్టు లోగో ఇదే

ఐపీఎల్ 2022 సీజన్ తో అరంగ్రేటం చేయనున్న రెండు కొత్త జట్లలో లక్నో జట్టు ఒకటి. ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13న జరిగే మెగా వేలంలో పాల్గొననుంది. ఈ క్రమంలో ముందుగానే తమ ఫ్రాంచైజీ లోగోను...

IPL 2022: కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా లక్నో జట్టు లోగో ఇదే

Lucknow Supergiants

Updated On : January 31, 2022 / 6:30 PM IST

IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్ తో అరంగ్రేటం చేయనున్న రెండు కొత్త జట్లలో లక్నో జట్టు ఒకటి. ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13న జరిగే మెగా వేలంలో పాల్గొననుంది. ఈ క్రమంలో ముందుగానే తమ ఫ్రాంచైజీ లోగోను ప్రకటించింది. పురాణాలను ప్రేరణగా తీసుకున్నట్లుగా ఉంది ఆ డిజైన్.

గరుడ పక్షిని పోలి ఉన్నట్లుగా రెక్కలకు త్రివర్ణ పతాక రంగులు, పక్షి బాడీ ఉండాల్సిన ప్లేస్ లో బ్యాట్ ఉంచి క్రికెట్ ప్రత్యేకతను చాటారు. ఈ మేరకు రిలీజ్ చేసిన వీడియోలో బంతి వచ్చి బ్యాట్ ను తాకగానే రెక్కలకు రంగులు వచ్చాయి. ఇక తిలకంగా బంతిని ఉంచి డిజైన్ ను పూర్తి చేశారు. ఈ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఇండియన్ ప్రీమియర్ లీగ్ విస్తరించే క్రమంలో గతేడాదే లక్నోకు చెందిన ఈ జట్టును రూ.7వేల 90కోట్లకు విక్రయించింది. గత నెలలో పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను రూ.17కోట్లు ఇచ్చి కొనుగోలు చేసినట్లుగా సమాచారం. లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు కేఎల్ రాహుల్.

Read Also: 25శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్‌లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా 2018 నుంచి 2021వరకూ కోహ్లీకి అంతే చెల్లించింది. మరో జట్టు అయిన అహ్మదాబాద్ ను సీవీసీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా.. హార్దిక్ పాండ్యా దానికి కెప్టెన్సీ వహించనున్నాడు.