KL Rahu : రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంపై కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇటువంటి పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. ఫిజికల్‌గా కూడా సవాలుగా ఉంటుంది. కానీ, మేమందరం పూర్తి ఫిట్ నెస్‌తో ఉన్నాం. అదే మైదానంలో చూపించాం అంటూ రాహుల్ చెప్పారు.

KL Rahu : రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంపై కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Teamindia Cricketer KL Rahu

Teamindia Cricketer KL Rahu : ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్ రాహల్ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ (58 నాటౌట్) కెప్టెన్ ఇన్సింగ్ ఆడాడు. 49 ఓవర్ మూడో బంతికి ఫోర్ తో అర్థం సెచంరీ చేసిన రాహుల్.. ఆ తరువాత బంతిని సిక్సర్‌గా మలిచి మ్యాచ్‌ను ముగించాడు. మరోవైపు భారత్ వన్డేల్లో అగ్రస్థానంతో పాటు మూడు ఫార్మాట్లలోనూ తొలి స్థానాన్ని టీమిండియా కైవసం చేసుకుంది.

Read Also : India Cricket Team : చరిత్ర సృష్టించిన భారత్.. అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ 1

మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ నాకేమీ ఇది మొదటిసారి కాదు.. ఇప్పటికే కెప్టెన్ గా చాలా మ్యాచ్ లలో జట్టును గెలిపించాను. ఒక సారథిగా జట్టును ఎలా నడిపించాలో నేను అలవాటు పడ్డాను అంటూ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో జట్టును నడిపించడం గురించా రహుల్ పేర్కొన్నారు. అదేవిధంగా కొలంబోలో ఆడివచ్చిన అనుభవంతో ఈ మ్యాచ్ ప్రారంభంలో మైదాన పరిస్థితులు స్వర్గాన్ని తలపించాయి. కానీ, మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. ఫిజికల్‌గా కూడా సవాలుగా ఉంటుంది. కానీ, మేమందరం పూర్తి ఫిట్ నెస్‌తో ఉన్నాం. అదే మైదానంలో చూపించాం అంటూ రాహుల్ చెప్పారు.

Read Also : IND vs AUS 1st ODI: 5 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు.. కేఎల్ రాహుల్ 75 పరుగులు బాది నాటౌట్

శుభ్‌మన్ గిల్ (74), రుతురాజ్ (71) నిష్క్రమణతో భాగస్వామ్యాన్ని నెలకొల్పడం తప్పనిసరి అయింది. సూర్యతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించగలిగాను. అలాంటి సవాలు పరిస్థితుల్లో నన్నునేను ఎదుర్కోవాల్సి వచ్చింది. సూర్య, నేను తరచూ మాట్లాడుకుంటూ ఎలాంటి షాట్లు ఆడాలనే విషయంపై చర్చించుకున్నాం. మ్యాచ్ ను ఆఖరివరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నట్లుగానే మ్యాచ్‌ను ముగించాం అని రాహుల్ చెప్పారు.