Athiya Shetty Birthday : లవ్ పార్ట్‌నర్ ఎవరో చెప్పిన రాహుల్

ఊహాగానాలకు చెక్ పెట్టాడు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. తన లవ్ పార్ట్ నర్ ఎవరో చెప్పారు. ఆమె ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Athiya Shetty Birthday : లవ్ పార్ట్‌నర్ ఎవరో చెప్పిన రాహుల్

Rahul

Updated On : November 6, 2021 / 11:29 AM IST

KL Rahul And Athiya Shetty : ఊహాగానాలకు చెక్ పెట్టాడు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. తన లవ్ పార్ట్ నర్ ఎవరో చెప్పారు. ఆమె ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత కొంతకాలంగా..బాలీవుడ్ నటి అతియా శెట్టితో…రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. దీంతో వారి మధ్య ప్రేమ ఉందనే ప్రచారం జరిగింది. వాళ్లు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

Read More : AP : పాపికొండల బోటింగ్…ఏర్పాట్లు పూర్తి

దీనిపై రాహుల్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. తాజాగా…అతియా బర్త్ డే సందర్భంగా…రాహల్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫొటోను పోస్టు చేశారు. దీంతో వీరిద్దరి మధ్యనున్న రిలేషన్ షిప్ ఇప్పుడు అఫిషియల్ గా మారింది. హార్ట్ ఎమోజీతో అతియాకు బర్త్ డే విషెష్ చెప్పారు రాహుల్. జులైలో ఇద్దరు తమ కామన్ ఫ్రెండ్ సోనాలి ఫాబియాను దిగిన ఫొటోలను వేర్వేరుగా పోస్టు చేశారు. ‘హ్యపి బర్త్‌డే మై లవ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి అసలు విషయం తెలిపాడు.

Read More : AP Crime : గ్రామ సచివాలయంలో బాలికను బంధించి వాలంటీర్ అత్యాచారం

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే గుసగుసలు వినిపించాయి. అతియా బర్త్ డే సందర్భంగా..రాహుల్ స్పందనతో రూమర్స్ కు చెక్ పెట్టినట్లైంది. రాహుల్ తో చేసిన ఓ ఫొటోషూట్ కు చెందిన పిక్ లను కూడా అతియా తన ఇన్ స్టాలో ఇటీవలే పోస్టు  చేశారు. టీ20 ప్రపంచకప్ 2021లో స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి, 6.3 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 263.16గా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by KL Rahul? (@rahulkl)