AP : పాపికొండల బోటింగ్…ఏర్పాట్లు పూర్తి

పాపికొండల బోటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

AP : పాపికొండల బోటింగ్…ఏర్పాట్లు పూర్తి

Papikondalu Boating Start From 2021, November 07th

Papikondalu Boating : పాపికొండల బోటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2021, నవంబర్ 07వ తేదీ నుంచి పున:ప్రారంభం కానుండడంతో శనివారం ట్రయల్ రన్ నిర్వహించారు. రెవిన్యూ, ఇరిగేషన్, పర్యాటక, పోలీస్ శాఖలు ఏర్పాట్లు చేశాయి. గండి పొసమ్మ తల్లి గుడి దగ్గర నుండి బోట్లు బయలుదేరనున్నాయి. రెండు ప్రభుత్వ బోట్లు, 9 ప్రైవేటు బోట్లకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఉదయం 9 గంటల లోపు బయలు దేరి తిరిగి సాయంత్రం 5 గంటలకు గండి పొసమ్మతల్లి గుడి ప్రాంతానికి చేరుకునేలా సమయాన్ని నిర్ధేశించారు.

Read More : Jordan Man : సెల్ ఫోన్‌‌లో చిలిపి పని చేసిన భార్య..విడాకులు ఇచ్చిన భర్త

గోదావరి నది పాపికొండల ప్రయాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసిందని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ వెల్లడించారు. బోట్లు అన్ని ఒకే సమయంలో బయలుదేరాలని, అన్ని బోట్లకు ఒక పైలెట్ బోటు ఉంటుందని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కట్రోల్ రూంలు ఏర్పాట్లు చేసి శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచినట్లు, ప్రతి అరగంటకు ఎక్కడ ఉన్నారో సమాచారం తెలుసుకొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అనుభవం ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయడం జరిగిందని, డ్రై రన్ అనంతరం ఏమైనా ఇబ్బందులు ఉంటే సరిదిద్దుకోవడం జరుగుతుందన్నారు.