AP Crime : గ్రామ సచివాలయంలో బాలికను బంధించి వాలంటీర్ అత్యాచారం

శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సచివాలంలో బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

AP Crime : గ్రామ సచివాలయంలో బాలికను బంధించి వాలంటీర్ అత్యాచారం

Volunteer Sexual Assault On A Girl

Volunteer sexual assault on a girl in srikakulam :  ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్న గ్రామ సచివాలయంలోనే దారుణం జరిగింది. శ్రీకాకుళం జిల్లా జిల్లాలో గ్రామ వలంటీర్ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన ఓ వాలంటీరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలోని వీరఘట్టం మండలం నడుకూరు సచివాలయంలో చోటుచేసుకుంది. ఈ దారుణం జరిగిక కొన్ని రోజులు అవుతున్నా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నడుకూరు గ్రామంలో గత శనివారం (అక్టోబర్ 31,2021) బొత్స హరిప్రసాద్‌ అనే వాలంటీరు ఓ బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ సమయంలో సచివాలంలోనే టెంపరరీ ఉద్యోగిగా పనిచేస్తున్న గుగ్గిలాపు రాంబాబు అక్కడే ఉన్నాడు. వాలంటీర్ ను అడ్డుకోవటం పోయి సహకరించాడు. బాలికను ఓ రూమ్ లోకి తీసుకువెళ్లిన హరిప్రసాద్ తలుపులు వేసేయగా..రాంబాబు తలుపులు బయట మూసివేసి తాళం వేసి కాపలా ఉన్నాడు.

హరిప్రసాద్ చేసిన అత్యాచారానికి తాళలేని బాధిుతురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తన కామవాంఛ తీర్చుకున్నాక వాలంటీర్ బాలిక పరిస్థితిని కూడా పట్టించుకోలేదు.అలాగే వదిలేసి తలుపులు తీసి పోయాడు. కాసేపటికి తేరుకున్న బాలిక ఇంటికి వెళ్లిపోయింది. ఇంటిలో ఉన్న బాలిక సోదరికి అనుమానం వచ్చింది. ఏం జరిగిందని అడిగింది. దానికి బాలిక జరిగిన విషయం చెప్పింది. ఒళ్లంతా నొప్పులుగా ఉందని ఏదోలా ఉందని ఏడుస్తు చెప్పింది. దీంతో ఆమె సోదరి తమ తల్లిదండ్రులు ఊర్లో లేకపోవటంతో వచ్చిన తరువాత జరిగిందంతా చెప్పింది.

దాంతో వారు నవంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై డీఎస్పీ వాసుదేవ్‌, దిశ బృందం గ్రామంలో విచారణ చేపట్టారు. బాధిత కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అత్యాచారం చేసిన వాలంటీర్ మీదా అతనికి సహకరించిన రాంబాము మీదా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం చర్యలు చేపడతామని ఎస్‌.ఐ. భాస్కరరావు తెలిపారు.