కోహ్లీ టర్బన్ లుక్.. అదుర్స్

కోహ్లీ టర్బన్ లుక్.. అదుర్స్

కోహ్లీ తన సొంత గెటప్‌లో కనిపించాడు. పంజాబీ కుటుంబానికి చెందిన ఢిల్లీ కుర్రాడు జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉంటూ సంప్రదాయ దుస్తుల్లో చాలా తక్కువగా కనిపించాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కోహ్లీ.. ఏప్రిల్ 17న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టును అభిమానులతో పంచుకున్నాడు. 

అందులో కోహ్లీ సింగ్‌లు వేసుకునే టర్బన్ దుస్తుల్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. అంతే క్షణాల్లో ఆ ఫొటో వైరల్ గా మారిపోయింది. మ్యాచ్ జయాపజయాలను ఆ కాసేపటి వరకే గుర్తుంచుకొనే కోహ్లీ విరామ సమయాన్ని టెన్షన్ లెస్‌గా తీసుకుంటాడు. ఈ క్రమంలోనే బుధవారం జట్టు సహచరులను ముంబైలోని తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు. 
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

ఈ సందర్భంగా దిగిన ఇప్పటివరకూ కనిపించని ఫొటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై పంచుకోవాలనుకున్నాడు. అందులో టర్బన్ లుక్‌లో కోహ్లీ నమస్కారం చేస్తున్నట్లుగా ఫోజ్ ఉంది. దాంతో పాటు ‘సత్ శ్రీ అకాల్ సారేయాన్ ను’ అని కింద రాశాడు. అంటే దేవుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని అర్థం. 24గంటల్లో ఈ పోస్టు 3లక్షలకు చేరుకుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sat Shri Akal saarreyaan nu! ??

A post shared by Virat Kohli (@virat.kohli) on