ఢిల్లీపై కోల్‌కత్తా విజయం.. చక్రవర్తికి 5వికెట్లు.. రాణించిన రానా, నరైన్

ఢిల్లీపై కోల్‌కత్తా జట్టు 59పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న ఢిల్లీ జట్టును పడగొట్టి కోల్‌కత్తా జట్టు మ్యాచ్‌లో విజయం దక్కించుకుంది. ఐపిఎల్ 2020లో 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌లోనూ బౌలింగ్‌లోను అధ్భుతంగా రాణించారు. ఈ సీజన్‌లో కోల్‌కత్తాకు ఇది ఆరవ విజయం. పాయింట్ టేబుల్‌లో మాత్రం నాలుగవ స్థానంలో కోల్‌కత్తా ఉంటుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోల్‌కతా తరఫున అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో అన్‌కాప్డ్ బౌలర్‌గా వరుణ్ నిలిచాడు.
అంతకుముందు, టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా.. కోల్‌కత్తా బ్యాటింగ్‌కు దిగింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా 42పరుగులకే 3వికెట్లు నష్టపోగా.. కష్టాల్లో పడింది. ఆ సమయంలో నితీష్ రానా, సునీల్ నరైన్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. 157పరుగుల వరకు వికెట్ పడకుండా ఆడి కోల్‌కత్తా స్కోరును నడిపించారు. దీంతో నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 194పరుగులు చేసింది కోల్‌కత్తా జట్టు.
కోల్‌కతా తరఫున సునీల్ నరైన్ 32 బంతుల్లో 64పరుగులు చెయ్యగా, నితీష్ రానా 53 బంతుల్లో 81 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రబాడా, స్టోయినిస్, నార్ట్జే తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కత్తా..మొదట్లోనే తడబడింది. రెండో ఓవర్లో 11 పరుగుల స్కోరుపై అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షుబ్మాన్ గిల్ 09 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ఆరో ఓవర్లో 35 పరుగుల స్కోరుతో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రాహుల్ త్రిపాఠి 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
రెండు వికెట్లు పడటంతో, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ దినేష్ కార్తీక్‌ను నాలుగవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపగా.. కార్తీక్ 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 42 పరుగులకు మూడు వికెట్లు పడటంతో మోర్గాన్ సునీల్ నరైన్‌ను బ్యాటింగ్‌కు దింపగా.. అక్కడ నుంచి రానా నాలుగో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. నరైన్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు, రానా 13 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. చివరికి, కెప్టెన్ మోర్గాన్ 9 బంతుల్లో 17 పరుగులు చేసి జట్టు స్కోరును 190కి తీసుకువచ్చాడు. అతను రెండు ఫోర్లు మరియు ఒక సిక్సర్ కొట్టాడు.
అదే సమయంలో ఎన్రిక్ నార్ట్జే ఢిల్లీ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేయగా.. తన కోటాలోని నాలుగు ఓవర్లలో కేవలం 27 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా మార్కస్ స్టోయినిస్ కగిసో రబాడా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతా నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా క్రీజులోకి రాగా.. మొదటి బంతికే అజింక్య రహానె వికెట్ కోల్పోయింది.
అనంతరం మూడో ఓవర్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ కేవలం ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ధావన్‌ను కూడా కమ్మిన్స్ పెవిలియన్‌కు పంపాడు. 13 పరుగులకు రెండు వికెట్లు పడటంతో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ 63 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. అయితే, ఇద్దరూ వేగంగా స్కోరు చేయడంలో విఫలం అయ్యారు. పంత్ 33 బంతుల్లో 27 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్ అయిన తరువాత, షిమ్రాన్ హెట్మీయర్ కూడా ఐదు బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
కోల్‌కత్తా బౌలర్ వరుణ్ చక్రవర్తి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తాన్ని ఒంటరిగా కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వరుణ్ రెండు వరుస బంతుల్లో హెట్మియర్ మరియు అయ్యర్లను పెవిలియన్‌కు పంపాడు. తరువాత, స్టోయినిస్ (06), అక్షర్ పటేల్ (09) కూడా వరుణ్ చేతుల్లోనే అవుట్ అయ్యారు. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా తరఫున వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అధ్బుత ప్రదర్శన ఇచ్చాడు. ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో అన్‌కాప్డ్ బౌలర్‌గా నిలిచాడు. తన నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులకే ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో పాట్ కమ్మిన్స్ నాలుగు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
That’s that from Match 42. @KKRiders win by 59 runs.#Dream11IPL pic.twitter.com/QfctclPHdn
— IndianPremierLeague (@IPL) October 24, 2020