Arjun Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మలింగ స్పెషల్ ట్రైనింగ్..!
బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ యువ బౌలర్లకు శిక్షణ ఇస్తున్నాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాడు.

Lasith Malinga schools Arjun Tendulkar video viral
Arjun Tendulkar – Lasith Malinga : ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో 29 పరుగుల తేడాతో గెలిచింది. హ్యాట్రిక్ ఓటముల తరువాత ఓ విజయాన్ని అందుకోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యతో సహా ముంబై అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. పాయింట్ల పట్టికలో ముంబై ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇక నుంచి ఆడాల్సిన మ్యాచుల్లో ముంబై విజయం సాధించడం ఎంతో అవసరం. దీంతో ముంబై తమ గత మ్యాచ్ ఫలితాన్నే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ముంబై ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ యువ బౌలర్లకు శిక్షణ ఇస్తున్నాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాడు.
ఒక్క వికెట్ మాత్రమే ఉంచి దాన్ని పడగొట్టాలంటూ సూచించాడు. అర్జున్‌తో పాటు కొందరు యువ బౌలర్లు ప్రయత్నించినా వికెట్‌ను బంతి తాకలేదు. దీంతో బంతి అందుకున్న లసిత్ మలింగ వికెట్‌ను ఎంతో ఈజీగా పడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏదీ మారలేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. 40 ఏళ్ల వయసులోనూ మలింగ లక్ష్యం మిస్ కావటం లేదు.. నిజంగా లెజెండ్ అంటూ నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా.. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో అర్జున్‌కు అవకాశం ఇవ్వాలని పలువురు అభిమానులు కోరుతున్నారు. అర్జున్ గత సీజన్‌లో కేకేఆర్‌తో మ్యాచులో అరంగ్రేటం చేశాడు. నాలుగు మ్యాచులు ఆడి మూడు వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచులోనూ అవకాశం రాలేదు.
???? ???? ????? ???? ?
??? ??? ??? ???? ????? ?? ????? ?? ???? ?#MumbaiMeriJaan #MumbaiIndians | @malinga_ninety9 pic.twitter.com/6MMKxhigwU
— Mumbai Indians (@mipaltan) April 10, 2024