Fifa2022: మెక్సికోను ఓడించిన అనంతరం షర్ట్ విప్పేసి గంతులేసిన మెస్సీ.. వీడియో వైరల్
సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా 1-2తో ఓడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద టీం అయిన అర్జెంటీనా.. సౌది చేతిలో పరాభవం పాలవ్వడం చాలా మందినిక షాక్‌కు గురి చేసింది. అయితే మెక్సికోపై అద్భుతంగా పునరాగమనం చేసింది. నవంబర్ 26న లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 2-0తో మెక్సికోను చిత్తు చేసింది అర్జెంటీనా. అయితే ఈ టోర్నీలో అర్జెంటీనాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

Lionel Messi goes shirtless, dances in delight to celebrate Argentina’s FIFA World Cup 2022 vs Mexico
Fifa2022: ఖతార్ చేతిలో దారుణ పరాభవం చూసిన అర్జెంటీనాకు మెక్సికోపై విజయం తెగ ఆనందాన్ని ఇచ్చినట్టుంది. ఇంకేం, టీంమేట్స్ అంతా కలిసి పాడుతూ, ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. అర్జెంటీనా దిగ్గజం లియోనోల్ మెస్సీ సైతం ఇందులో పాలు పంచుకున్నాడు. ఏకంగా షర్ట్ విప్పేసి, టీంమేట్స్‌తో కలిసి పాడుతూ, డాన్స్ చేస్తూ మెస్సీ కనిపించడం ఫుట్‌బాల్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా 1-2తో ఓడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద టీం అయిన అర్జెంటీనా.. సౌది చేతిలో పరాభవం పాలవ్వడం చాలా మందినిక షాక్‌కు గురి చేసింది. అయితే మెక్సికోపై అద్భుతంగా పునరాగమనం చేసింది. నవంబర్ 26న లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 2-0తో మెక్సికోను చిత్తు చేసింది అర్జెంటీనా. అయితే ఈ టోర్నీలో అర్జెంటీనాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
Así se celebra en el vestuario de @Argentina la victoria #SeleccionArgentina pic.twitter.com/GzFE2Eh002
— Veronica Brunati (@verobrunati) November 26, 2022
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతమైన గోల్ కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చిన మెస్సీ, డ్రెస్సింగ్ రూమ్‌లో తన సహచరులతో కలిసి షర్ట్ లేకుండా వెళ్లి డ్యాన్స్ చేశాడు. గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అయతే ఏకంగా టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేశాడు. అర్జెంటీనా ఆటగాళ్ల హంగామా వీడియోలో చూడొచ్చు.