Meerut: దారుణానికి తెగబడ్డ విద్యార్థులు.. క్లాస్ రూంలోనే టీచర్‭పై లైంగిక వేధింపులు.. వీడియో తీస్తూ రాక్షసానందం

వారి బుద్ధి మారితేనా.. నానాటికీ ఇంకా పెరిగి పెద్దదయింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే, క్లాస్ రూంలో ఆమెకు ‘ఐ లవ్ యూ జాన్’ అంటూ, అసభ్యమైన పదజాలంతో ఏవేవో వ్యాఖ్యానిస్తూ.. దీన్నంతటినీ వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత వికృతంగా ప్రవర్తించారు. వారిని మార్చడం ఇక తన వల్ల కాదని అనుకున్న ఆ టీచర్.. క్లాస్ రూం నుంచి ఎంతో అసహనంతో బయటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు

Meerut: దారుణానికి తెగబడ్డ విద్యార్థులు.. క్లాస్ రూంలోనే టీచర్‭పై లైంగిక వేధింపులు.. వీడియో తీస్తూ రాక్షసానందం

Students allegedly harass teacher in UP school

Meerut: క్లాస్ రూంలో టీచర్‭కు సైట్ కొడుతూ, ఆమెను హేళన చేస్తున్న దృశ్యాలను కొన్ని సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఇలాంటి దారుణాలు కేవలం సినిమాలకే పరిమితం కాదు. నిజ జీవితంలోనూ అనేక ఉదహారణలు ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, వెలుగులోకి వచ్చేవి అతి కొద్ది మాత్రమే. విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి బదులు, ఇలాంటి పైత్యపు చేష్టలు చేస్తూ రాక్షసానందం పొందేవారు చాలానే ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‭లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.

Population Control Bill: చైనాతో పోల్చుతూ జనాభా నియంత్రణ బిల్లు ఎందుకు కీలకమో చెప్పిన కేంద్ర మంత్రి

ముగ్గురు విద్యార్థులు.. ఒక టీచర్‭ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారు. నిజానికి కొద్ది రోజులుగా వాళ్లు అలాగే ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆమెకు ‘ఐ లవ్ యూ’ చెబుతూ, గేలి చేస్తూ ఆ ముగ్గురు విద్యార్థులు రాక్షసానందం పొందుతున్నారు. ఇంత చేస్తున్నా.. ఆ టీచర్ మాత్రం.. చిన్న పిల్లలు, తెలియక దారి తప్పుతున్నారని వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. వారి చేష్టలను, వారు చేసే కామెంట్లను పెద్దగా పట్టించుకోకుండా వారిని దారిలో పెట్టే ప్రయత్నం చేసింది.

Jamaat-e-Islami: నిషేధిత సంస్థ జమాతే ఇస్లామీకి చెందిన రూ.90 కోట్ల విలువైన 11 కీలక ఆస్తులు సీజ్

కానీ, వారి బుద్ధి మారితేనా.. నానాటికీ ఇంకా పెరిగి పెద్దదయింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే, క్లాస్ రూంలో ఆమెకు ‘ఐ లవ్ యూ జాన్’ అంటూ, అసభ్యమైన పదజాలంతో ఏవేవో వ్యాఖ్యానిస్తూ.. దీన్నంతటినీ వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత వికృతంగా ప్రవర్తించారు. వారిని మార్చడం ఇక తన వల్ల కాదని అనుకున్న ఆ టీచర్.. క్లాస్ రూం నుంచి ఎంతో అసహనంతో బయటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు.

ఆ ముగ్గురు విద్యార్థుల పేరు అమన్, కైఫ్, అతాష్.. ముగ్గురు ముస్లిం కమ్యూనిటీకి చెందినవారే. ఇక బాధితురాలైన టీచర్ కూడా అదే కమ్యూనిటీకి చెందినవారు. వీడియో ఆమె తలపై నల్లటి స్కార్ఫ్ ధరించి ఉండడాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఇక విద్యార్థులు మైనర్లు కావడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Assam: ఆరోగ్య శిబిరంలోని మందులు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన 52 మంది విద్యార్థులు