Assam: ఆరోగ్య శిబిరంలోని మందులు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన 52 మంది విద్యార్థులు

చరైడియో జిల్లాలోని బటావు ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేశారు. తొలుత ఖేరనిపత్తర్ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో 75 మంది విద్యార్థులకు ఇచ్చారు. అనంతరం నిమలియా లోయర్ ప్రైమరీ స్కూల్‌లో 26 మందికి ఈ మాత్రలను పంపిణీ చేశారు.

Assam: ఆరోగ్య శిబిరంలోని మందులు వికటించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన 52 మంది విద్యార్థులు

Over 52 Assam students in hospital after taking folic tablets

Updated On : November 27, 2022 / 7:54 PM IST

Assam: ఆరోగ్య శిబిరంలో పంపిణీ చేసిన మందులు వికటించడంతో దాదాపు 52 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్సాం రాష్ట్రంలోని చరైడియో జిల్లాలో శనివారం జరిగిన ఘటన ఇది. అస్వస్థతకు గురైన విద్యార్థుల్ని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చరైడియో జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు శనివారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం తర్వాత వాటిని విద్యార్థులు తిన్నారు.

Population Control Bill: చైనాతో పోల్చుతూ జనాభా నియంత్రణ బిల్లు ఎందుకు కీలకమో చెప్పిన కేంద్ర మంత్రి

కాసేపటికి, విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని రెండు పాఠశాలల నుంచి ఆరోగ్య శాఖాధికారులకు సమాచారం అందింది. ఈ రెండు పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఇద్దరు చొప్పున తమకు కడుపు నొప్పిగా ఉందని చెప్పి, వాంతులు చేసుకున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే వారిని సోనారీ సివిల్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. ఆ తర్వాత మరో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. వైద్య పరీక్షల అనంతరం మొత్తం మీద 52 మంది విద్యార్థులను ఆసుపత్రి నుంచి ఇళ్ళకు పంపించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

Russia New Law: అద్దె గర్భానికి తమ దేశ మహిళల్ని విదేశీయులు ఉయోగించుకోకుండా చట్టం చేస్తోన్న రష్యా

చరైడియో జిల్లాలోని బటావు ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేశారు. తొలుత ఖేరనిపత్తర్ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో 75 మంది విద్యార్థులకు ఇచ్చారు. అనంతరం నిమలియా లోయర్ ప్రైమరీ స్కూల్‌లో 26 మందికి ఈ మాత్రలను పంపిణీ చేశారు. పాఠశాల నిర్వహణ కమిటీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖాధికారులు ముందుగా తమకు తెలియజేయలేదని తెలిపారు.

Jamaat-e-Islami: నిషేధిత సంస్థ జమాతే ఇస్లామీకి చెందిన రూ.90 కోట్ల విలువైన 11 కీలక ఆస్తులు సీజ్