Jamaat-e-Islami: నిషేధిత సంస్థ జమాతే ఇస్లామీకి చెందిన రూ.90 కోట్ల విలువైన 11 కీలక ఆస్తులు సీజ్

2019లో ఈ సంస్థను నిషేధించడానికి ముందు వరకూ పలు పాఠశాలల నుంచి నెట్‌వర్క్ దీనికి ఉండేది. కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ మూలసంస్థగా కూడా జమాతేకు పేరుంది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే కారణంగా జమాతేపై నిషేధం వేటు పడింది. కాగా, ఉగ్రవాదానికి నిధులు అందకుండా చేయడం కోసం జమాతేపై స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాజాగా దృష్టి పెట్టింది.

Jamaat-e-Islami: నిషేధిత సంస్థ జమాతే ఇస్లామీకి చెందిన రూ.90 కోట్ల విలువైన 11 కీలక ఆస్తులు సీజ్

11 more JeI properties worth Rs 90 crore seized by SIA

Jamaat-e-Islami: నిషేధిత సంస్థ జమాతే ఇస్లామీపై స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఐఏ) కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఈ సంస్థకు చెందిన 11 కీలక ఆస్తులను ఎస్ఐఏ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.90 కోట్లు వరకూ ఉంటుందని సమాచారం. వేర్పాటువాదం, ఉగ్రవాద కార్యకలాపాలకు జమాతే ఇస్లామీపై స్టేట్ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థకు జమ్మూకశ్మీర్‌లో దాదాపు 200 ఆస్తులు ఉన్నట్టు ఎస్ఐఏ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంస్థ ఆస్తులపై శనివారం భారీ పోలీసు బందోబస్తుతో దాడి చేసింది.

Population Control Bill: చైనాతో పోల్చుతూ జనాభా నియంత్రణ బిల్లు ఎందుకు కీలకమో చెప్పిన కేంద్ర మంత్రి

స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు బ్యానర్లు కూడా ఏర్పాటు చేసింది ఎస్ఐఏ. ఈ నెల మొదటి వారంలో సోపియాన్ జిల్లాల్లో జమాతేకు చెందిన రెండు పాఠశాల భవనాలు సహా తొమ్మిది ఆస్తులను ఎస్ఐఏ స్వాధీనం చేసుకుంది. యూఏపీఏ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింది ఈ ఆస్తులను జిల్లా మేజిస్ట్రేటు నోటిఫై చేశారు. జమ్మూకశ్మీర్‌లో జమాతే సంస్థ ఒకప్పుడు అతిపెద్ద రాజకీయ, మతపర సంస్థగా ఉండేది.

Bus Stop in Mysuru: మసీదును తలపించే విధంగా ఉన్న బస్ స్టాప్.. బీజేపీ ఎంపీ బెదిరింపులతో రాత్రికి రాత్రే మారిన రూపు రేకలు

2019లో ఈ సంస్థను నిషేధించడానికి ముందు వరకూ పలు పాఠశాలల నుంచి నెట్‌వర్క్ దీనికి ఉండేది. కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ మూలసంస్థగా కూడా జమాతేకు పేరుంది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే కారణంగా జమాతేపై నిషేధం వేటు పడింది. కాగా, ఉగ్రవాదానికి నిధులు అందకుండా చేయడం కోసం జమాతేపై స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాజాగా దృష్టి పెట్టింది.

Russia New Law: అద్దె గర్భానికి తమ దేశ మహిళల్ని విదేశీయులు ఉయోగించుకోకుండా చట్టం చేస్తోన్న రష్యా