Lookback Sports : 2024లో ఒకటి తప్ప.. అన్నిట్లో విజయమే.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌రిచిపోలేని ఏడాది

మ‌రో మూడు వారాల్లో కొత్త సంవ‌త్స‌రం రాబోతుంది.

Lookback Sports : 2024లో ఒకటి తప్ప.. అన్నిట్లో విజయమే.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌రిచిపోలేని ఏడాది

Look Back 2024 winning T20 World Cup to Virat Rohit retirement Indian cricket team performance

Updated On : December 19, 2024 / 4:00 PM IST

మ‌రో మూడు వారాల్లో కొత్త సంవ‌త్స‌రం రాబోతుంది. 2024 ఏడాదిలో భార‌త క్రికెట్‌కు కొన్ని మ‌ధురమైన స్మృతులు ఉన్నాయి. అలాగే కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాది భార‌త్ టీ20 ప్ర‌పంచ క‌ప్ విజ‌యం సాధించింది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమ్ఇండియా కైవ‌సం చేసుకుంది. ఈ ఏడాది భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌ను ఓ సారి ప‌రిశీలిద్దాం..

2024లో భార‌త జ‌ట్టు మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను భార‌త్ 4-1తో కైవసం చేసుకుంది. ఆ త‌రువాత బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే.. అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భార‌త్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. 0-3 తేడాతో భార‌త్ ఘోర పరాజయాన్ని చ‌విచూసింది. ఈ ఓటమితో భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి.

ICC Player of the Month : బుమ్రాకు షాకిచ్చిన పాకిస్థాన్ స్టార్ పేస‌ర్‌..

ప్ర‌స్తుతం బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో భార‌త్ త‌ల‌ప‌డుతోంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మ్యాచులు పూర్తి అయ్యాయి. తొలి మ్యాచులో గెల‌వ‌గా, రెండో మ్యాచులో ఓడిపోయింది. ఈ ఏడాది భార‌త్ మ‌రో రెండు టెస్టులు ఆడ‌నుంది. అవి ఆసీస్‌తో జ‌ర‌గ‌నున్న మూడు, నాలుగు టెస్టులు. ఐదో మ్యాచ్ కొత్త సంవ‌త్స‌రంలో జ‌ర‌గ‌నుంది.

17 ఏళ్ల క‌ల నెర‌వేరిన వేల‌..

రోహిత్ శర్మ నాయకత్వంలో 17 ఏళ్ల తర్వాత భార‌త్ రెండో సారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచింది. జూన్ 29న భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ ప్ర‌త్యేక రోజుగా మిగిలిపోయింది. టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించారు.

ప్రపంచకప్ కాకుండా ఈ ఏడాది భారత్ 18 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అఫ్గానిస్థాన్ 3-0, జింబాబ్వే 4-1, శ్రీలంక 3-0, బంగ్లాదేశ్ 3-0, ద‌క్షిణాఫ్రికా పై 3-1తో ఓడించింది.

IND vs AUS : బ్రిస్బేన్‌లో అడుగుపెట్టిన రోహిత్ సేన‌.. మ‌రోసారి చ‌రిత్ర పున‌రావృత‌మ‌య్యేనా?

అన్ని ఫార్మాట్ల‌లో అగ్ర‌స్థానం..

ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లోనూ భారత్ హ‌వా కొన‌సాగించింది. వన్డే, టీ20, టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయినా, మిగతా రెండు ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. పురుషుల బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. టీ20 క్రికెటర్లలో ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నంబర్ వన్. టెస్టు ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ కెరీర్ అత్యుత్త‌మ ర్యాంకుల‌ను చేరుకున్నారు.

రాహుల్ ద్ర‌విడ్ గుడ్ బై.. గంభీర్ ఇన్‌..

టీ20 ప్రపంచకప్‌తో ప్ర‌ధాన కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగిసింది. కొత్త కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టాడు. మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా డచ్ ఆటగాడు ర్యాన్ డోస్చేట్‌, అభిషేక్ నాయర్ ల‌ను అసిస్టెంట్ కోచ్‌లుగా నియ‌మించారు.

IND vs AUS : ఇదేం పిచ్చిరా అయ్యా.. ఇంకా 15 రోజులు ఉండ‌గానే.. ఫ‌స్ట్ డే టికెట్లు సోల్డ్‌..

ఈ ఏడాది ఒకే ఒక్క వన్డే సిరీస్‌ ఆడిన భారత్‌.. అందులో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. తొలి వన్డేను డ్రా చేసుకున్న భారత్ రెండో వన్డేలో 32 పరుగుల తేడాతోనూ, మూడో వన్డేలో 110 పరుగుల తేడాతోనూ ఓడిపోయింది.