మలింగ రిటైర్మెంట్: వరల్డ్ కప్ స్క్వాడ్ కెప్టెన్‌గా కరుణరత్నె

మలింగ రిటైర్మెంట్: వరల్డ్ కప్ స్క్వాడ్ కెప్టెన్‌గా కరుణరత్నె

మే నెలాఖరులో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌కు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఇందులో భాగంగానే శ్రీలంక క్రికెట్ బోర్డు మలింగకు షాక్ ఇవ్వడంతో పాటు కరుణరత్నెను కెప్టెన్‌గా ప్రకటించి సంచలనానికి తెరదీసింది లంక బోర్డు. 2015వరల్డ్ కప్‌కు లంక జట్టుకు కెప్టెన్సీ వహించిన దిముత్ కరుణరత్నెకు పగ్గాలు అప్పజెప్పింది. 

ప్రముఖ పత్రిక డెక్కన్ క్రానికల్ కథనం ప్రకారం.. కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మలింగ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. లంక జట్టు చీఫ్ సెలక్టర్ అసంత దె మెల్ కెప్టెన్సీపై స్పష్టత ఇవ్వకుండానే మలింగ జట్టుకు అందుబాటులో ఉంటాడాననే విషయంపై అనుమానం వ్యక్తం చేశాడు. 
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

లంక క్రికెట్ బోర్డు బుధవారం ఏప్రిల్ 17 వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటించిన గంట తర్వాత సహచర ఆటగాళ్లకు ఓ మెసేజ్ పంపాడు. అందులో’మళ్లీ మైదానంలో మనం కలుస్తామనుకోవడం లేదు. ప్రతి ఒక్కరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.