IND vs PAK : సూప‌ర్ ఫ్యాన్.. టీమ్ఇండియా జెర్సీతో క‌నిపించిన మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌..

భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు.

IND vs PAK : సూప‌ర్ ఫ్యాన్.. టీమ్ఇండియా జెర్సీతో క‌నిపించిన మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌..

Microsoft CEO Satya Nadella Spotted Wearing Indian Jersey

India vs Pakistan : భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ఇరు దేశాల అభిమానులే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు సైతం ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఉత్సాహం చూపుతుంటారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ అభిమానుల‌కు మంచి కిక్ ఇచ్చింది. స్వ‌ల్ప స్కోర్లు న‌మోదైన ఈ మ్యాచ్‌లో భార‌త్ 6 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌కు సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం హాజ‌రు అయ్యారు. అందులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. ఆయ‌న భార‌త క్రికెట్ జ‌ట్టు జెర్సీని ధ‌రించి టీమ్ఇండియాను ఉత్సాహ‌ప‌రిచారు. ఆయ‌న‌తో పాటు వ్యవస్థాపకుడు గౌరవ్ జైన్ కూడా ఉన్నాడు.

పాకిస్థాన్‌పై విజయం తరువాత టీమిండియా బ్యాటింగ్ తీరుపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

ఇందుకు సంబంధించిన ఫోటోను గౌర‌వ్ జైన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. సూప‌ర్ ఫ్యాన్ స‌త్య‌నాదెళ్ల‌తో క‌లిసి టీమ్ఇండియాను ఉత్సాహ‌ప‌ర‌చ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని రాసుకొచ్చాడు. ఈ ఫోటో వైర‌ల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. 19 ఓవ‌ర్ల‌లో 119 ప‌రుగుల‌కే ఆలౌటైంది. రిష‌బ్ పంత్ (42) టాప్ స్కోర‌ర్‌. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్ లు చెరో మూడు వికెట్లు తీశారు. మహ్మద్‌ ఆమిర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులే చేసింది. మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (31) టాప్ స్కోర‌ర్‌. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో బుమ్రా మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు చెరో వికెట్ సాధించారు.

తక్కువ ప‌రుగుల‌కే విరాట్ కోహ్లీ అవుట్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్