టీ20 ప్రపంచ కప్ 2024లో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించేది ఎవరో తెలుసా? క్లారిటీ ఇచ్చిన కోచ్
టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం ఎవరు వహిస్తారనే అంశంపై కొద్దిరోజులుగా క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతుంది.

Mitchell Marsh
T20 World Cup 2024 : ఈ ఏడాది జూన్ 6 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభమవుతోంది. ఈ మెగా టోర్నీకోసం అన్నిజట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే, టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం ఎవరు వహిస్తారనే అంశంపై కొద్దిరోజులుగా క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతుంది. మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తరువాత నుంచి ఆస్ట్రేలియా టీ20 జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా ఆ జట్టు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వ్యవహరిస్తున్నాడు. అయితే, అతనే టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో పలువురిపేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు పగ్గాలు అందుకుంటాడని ప్రచారం జరిగింది. పాట్ కమిన్స్ పేరుకూడా వినిపించింది.
Also Read : WPL 2024 : మైదానంలో కన్నీటి పర్యంతమైన ఆర్‌సీబీ ప్లేయర్.. ప్రత్యర్థి ప్లేయర్లు వచ్చి
ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. టీ20 జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా మిచెల్ మార్ష్ అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పాడు. మార్ష్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లపై సిరీస్ లను గెలిచాడు. మాథ్యూ వేడ్, వన్డే జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కూడా టీ20 వరల్డ్ కప్ లో ఆసీస్ జట్టుకు సారథ్యం వహించే సామర్థ్యం కలిగిన వాళ్లే. కానీ, మార్ష్ కెప్టెన్సీలో అద్భుతమైన ఫలితాలు రాబట్టాడు. ఆస్ట్రేలియా జట్టు మేనేజ్ మెంట్ కూడా అతని కెప్టెన్సీ పట్ల సంతోషంగా ఉందని చెప్పాడు. దీంతో.. జట్టు కోచ్, ముగ్గురు సెలెక్టర్లలో ఒకరైన ఆండ్రూ మెక్ డొనాల్డ్ మిచెల్ మార్ష్ కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చేశారు.
టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా 32ఏళ్ల మార్ష్ కు అధికారికంగా పగ్గాలు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు సిఫార్సు చేస్తానని, అయితే, అధికారిక ప్రకటన సరైన సమయంలో జరుగుతుందని నేను భావిస్తున్నానని మెక్ డొనాల్డ్ చెప్పారు.
Also Read : WTC Points Table : న్యూజిలాండ్‌పై విజయం.. డబ్ల్యూటీసీలో టీమ్ఇండియా అగ్రస్థానికి పొంచి ఉన్న ఆసీస్ ముప్పు
MITCHELL MARSH WILL LEAD AUSTRALIA IN THE T20I WORLD CUP 2024…!!!! pic.twitter.com/ZNgDhqZoz8
— Johns. (@CricCrazyJohns) March 12, 2024