Mohammad Azharuddin: హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కి చుక్కెదురు

ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

Mohammad Azharuddin: హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కి చుక్కెదురు

Mohammad Azharuddin

Updated On : October 5, 2023 / 5:38 PM IST

HCA Elections: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి చుక్కెదురైంది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే, మరోవైపు డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు జస్టిస్ లావు నాగేశ్వర రావు కమిటీ ప్రకటన చేసింది.

కాగా, ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. హెచ్‍సీఏ ఎన్నికలకు ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం, అదే రోజున ఫలితాలు వెల్లడవుతాయి.

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ తో పాటు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ సభ్యులను దీని ద్వారా ఎన్నుకుంటారు. హెచ్‌సీఏకు మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు చేతిలోనే హెచ్‌సీఏ బాధ్యతలు ఉన్నాయి. హెచ్‍సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ పదవీ కాలం గతంలోనే ముగిసింది.

Also Read

ODI World Cup-2023: మ్యాచులు చూడడానికి వెళ్లే ప్రేక్షకులకు బీసీసీఐ గుడ్‌న్యూస్