ODI World Cup-2023: మ్యాచులు చూడడానికి వెళ్లే ప్రేక్షకులకు బీసీసీఐ గుడ్‌న్యూస్

వన్డే ప్రపంచ కప్‌-2023లో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను సృష్టించుకుందామని జై షా అన్నారు.

ODI World Cup-2023: మ్యాచులు చూడడానికి వెళ్లే ప్రేక్షకులకు బీసీసీఐ గుడ్‌న్యూస్

ODI World Cup 2023

Jay Shah: వన్డే ప్రపంచ కప్‌-2023 మ్యాచులు చూడడానికి స్టేడియాలకు వెళ్తున్న ప్రేక్షకులకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రేక్షకులకు ఉచితంగా మినరల్, ప్యాకేజ్డ్ వాటర్ అందిస్తామని తెలిపారు. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందని జై షా చెప్పారు.

దేశంలో మ్యాచులు జరిగే అన్ని స్టేడియాల్లోనూ ఈ తాగునీటి సదుపాయాన్ని అందిస్తామని అన్నారు. హైడ్రేట్‌‌గా ఉంటూ మ్యాచులను ఎంజాయ్ చేయాలని ఆయన దేశంలోని ఫ్యాన్స్ కు చెప్పారు. వన్డే ప్రపంచ కప్‌-2023లో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను సృష్టించుకుందామని అన్నారు.

కాగా, ప్రపంచ కప్ మ్యాచులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పూర్తిగా భారత్ లోనే మ్యాచులు అన్నీ జరగనున్నాయి. భారత్ వచ్చే ఆదివారం ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో తలపడనుంది. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్ వన్డే సిరీస్ ను గెలుకుని, ఆ ఫార్మాట్లో ప్రపంచ నంబర్ 1గా నిలిచింది. సొంత దేశంలో ప్రపంచ కప్ జరుగుతుండడం, టీమిండియా ఫాంలో ఉండడంతో భారత్ కప్పు కొడుతుందని ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

Also Read : ప్ర‌పంచ క‌ప్ తొలి ఓవ‌ర్‌లోనే చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌..!