World Cup 2023 ENG vs NZ : ప్ర‌పంచక‌ప్ తొలి ఓవ‌ర్‌లోనే చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌..!

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ప్రారంభ‌మైంది. ఆరంభ వేడుక‌లు లేకుండానే టోర్నీ ప్రారంభం కావ‌డంతో అభిమానులు కాస్త నిరాశ‌కు గురి అయ్యారు.

World Cup 2023 ENG vs NZ : ప్ర‌పంచక‌ప్ తొలి ఓవ‌ర్‌లోనే చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్‌..!

pic @ECB twitter

ENG vs NZ : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ప్రారంభ‌మైంది. ఆరంభ వేడుక‌లు లేకుండానే టోర్నీ ప్రారంభం కావ‌డంతో అభిమానులు కాస్త నిరాశ‌కు గురి అయ్యారు. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు మొద‌టి మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. అయితే.. ఇంగ్లాండ్ జ‌ట్టు మొద‌టి ఓవ‌ర్‌లోనే చ‌రిత్ర సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఇంగ్లాండ్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లుగా జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలన్ లు వ‌చ్చారు. మొద‌టి ఓవ‌ర్‌ను ట్రెంట్ బౌల్డ్ వేయ‌గా రెండో బంతిని బెయిర్ స్టో సిక్స్‌గా మలిచాడు. ఇంగ్లాండ్ ప‌రుగుల ఖాతా సిక్స్‌తో ఆరంభ‌మైంది. కాగా.. ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీల్లో ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌టి స్కోరింగ్ ప‌రుగులు సిక్స్ రూపంలో రాలేదు. దీంతో ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి జ‌ట్టుగా ఇంగ్లాండ్ చ‌రిత్ర సృష్టించింది. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతికి ఫోర్ కొట్టాడు బెయిర్ స్టో. మొత్తంగా మొద‌టి ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి.

Kishore Kumar Jena : జావెలిన్ స్టార్ కిషోర్ జెనాకు రూ.1.5 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించిన సీఎం

 Jonny Bairstow Opens World Cup 2023 With A Six

Jonny Bairstow Opens World Cup 2023 With A Six

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 35 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. డేవిడ్‌ మలాన్‌ (14), బెయిర్‌స్టో (33), హ్యారీ బ్రూక్‌ (25), మొయిన్‌ అలీ (11), జోస్ బ‌ట్ల‌ర్ (43) ఔట్ కాగా.. జో రూట్ (62), లియామ్ లివింగ్‌స్టోన్ (12) లు ఆడుతున్నారు.

Joe Root : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచులో రూట్ అందుకున్న అరుదైన ఘ‌న‌త‌లు ఇవే..