Mohammad Shami: ఆరోసారి 5 వికెట్లు.. 200 క్లబ్‌లో షమీ

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహ్మద్‌ షమీ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 5 వికెట్లతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టి పతనాన్ని చవిచూశాడు.

Mohammad Shami: ఆరోసారి 5 వికెట్లు.. 200 క్లబ్‌లో షమీ

Mohammed Shami

Updated On : December 29, 2021 / 9:08 AM IST

Mohammad Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహ్మద్‌ షమీ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 5 వికెట్లతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టి పతనాన్ని చవిచూశాడు. షమీ బౌలింగ్ లో ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. షమీకి టెస్టు కెరీర్‌లో 5 వికెట్ల హాల్‌ అందుకోవడం ఆరోసారి.

ఈ క్రమంలోనే మహ్మద్‌ షమీ టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 55 టెస్టుల్లో షమీ 200 వికెట్ల మార్క్‌ను చేరుకోగలిగాడు. 50 టెస్టుల్లో కపిల్‌ దేవ్‌ 200 వికెట్ల మార్క్‌ సాధించి తొలి స్థానంలో నిలవగా.. జగవల్‌ శ్రీనాథ్‌(54 టెస్టుల్లో) రెండో స్థానం, షమీ(55 టెస్టులు) మూడో స్థానం, 63 టెస్టులతో నాలుగో స్థానంలో జహీర్‌ఖాన్‌, ఇషాంత్‌ శర్మలు సంయుక్తంగా నిలిచారు.

టీమిండియా తరపున 200 టెస్టు వికెట్లు పడగొట్టడానికి షమీకి 9వేల 896 బంతులు అవసరం అయ్యాయి. ఈ జాబితాలో షమీనే నెంబర్‌వన్‌ కావడం విశేషం. తర్వాతి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ 10వేల 248 బంతులతో, మూడో స్థానంలో కపిల్‌ దేవ్ 11వేల 66 బంతులు, రవీంద్ర జడేజా 11989 బంతులు) నాలుగో స్థానంలో​ ఉన్నారు.

ఇది కూడా చదవండి: ధోనీ.. సాహాలతో సమానంగా పంత్

సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను 197 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ చెలరేగాడు. 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాకు దడ పుట్టించాడు.