Mohammed Shami : కూతురి పుట్టిన రోజు.. ఆమె ఫోటోలను షేర్ చేస్తూ షమీ భావోద్వేగపు పోస్ట్..
టీమ్ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్ కెరీర్ ఎలాగున్నప్పటికి కూడా అతడి వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకులతో సాగుతోంది

Shami heartfelt birthday wish to daughter
టీమ్ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్ కెరీర్ ఎలాగున్నప్పటికి కూడా అతడి వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదుడుకులతో సాగుతోంది. తన భార్య హసిన్ జహాన్ నుంచి అతడు విడిపోయాడు. అతడి కూతురు ఐరా ప్రస్తుతం హసినా జహాన్ వద్దనే ఉంటోంది. కాగా.. నేడు (జూలై 17)న ఐరా పుట్టిన రోజు. 10వ బర్త్‌డే సందర్భంగా షమీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌ను పెట్టాడు. తన కూతురితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు.
“ప్రియమైన కూతురా.. మనం మేల్కొని, మాట్లాడుతూ, నవ్వుతూ గడిపిన రాత్రులు, ముఖ్యంగా నీ డ్యాన్స్ ఇంకా నాకు గుర్తున్నాయి. నువ్వు ఇంత వేగంగా పెరుగుతున్నావని నేను నమ్మలేకపోతున్నాను. నీకు జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. దేవుడు నీకు ఎల్లప్పుడూ ప్రేమ, శాంతి, ఆనందం, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. పుట్టినరోజు శుభాకాంక్షలు.” అని షమీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
View this post on Instagram
2014లో షమీ, హసిన్ జహాన్ లు పెళ్లి చేసుకున్నారు. 2015లో వారికి ఐరా జన్మించింది. అయితే.. దంపతుల మధ్య విభేదాల కారణంగా 2018లో విడిపోయారు. అప్పటి నుంచి తండ్రీకూతురు మధ్య సంబంధం సంక్లిష్టంగా మారింది. ఐరా ప్రస్తుతం తన తల్లితో కలిసి కోల్‌కతాలో నివసిస్తోంది.
Virat Kohli : కోహ్లీ మనసు మార్చుకో.. టెస్టుల్లో రీ ఎంట్రీ ఇవ్వు..
షమీ, జహాన్‌ను విడిపోయినప్పటికి కూడా.. వారి న్యాయ పోరాటాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కలకతా హైకోర్టు.. షమీ తన భార్యకు నెలకు రూ.1.5లక్షలు, కూతురికి రూ.2.5లక్షలు భరణంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై హసిన్ జహాన్ మీడియాతో మాట్లాడుతూ.. షమీలాగానే తాము జీవించాలని అనుకుంటున్నామని, తమ జీవనశైలికి రూ.4లక్షలు చాలవని తెలిపింది. నెలకు రూ.10లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పింది.