Jemimah Rodrigues : గవాస్కర్ ప్రామిస్.. జెమీమా రోడ్రిగ్స్ ఆన్సర్.. ‘నేను సిద్ధంగా ఉన్నా.. మీరు రెడీనా..’
సునీల్ గవాస్కర్ ఇచ్చిన ప్రామిస్ పై జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) స్పందించింది.
                            Jemimah Rodrigues reminds Sunil Gavaskar of his promise to sing with her after World Cup win
Jemimah Rodrigues : ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షలాగా ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్‌ను భారత్ అందుకుంది. ఆదివారం (నవంబర్ 2)న నవీ ముంబై వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి మరీ భారత్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో జట్టు పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
టీమ్ఇండియా ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడో లేదో అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) స్పందించింది. తాను సిద్ధం అని చెప్పింది.
Rahul Dravid : అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ.. సి టీమ్‌లో ద్రవిడ్ చిన్న కొడుకు
గవాస్కర్ ఏమన్నాడంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై భారత్ విజయం సాధించిన తరువాత టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ అభిమానులకు ఓ ప్రామిస్ చేశారు. భారత జట్టు గనుక ప్రపంచకప్ గెలిస్తే అప్పుడు తాను సెమీస్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్ గిటారు వాయిస్తుంటే పాట పాడుతానన్నాడు. అయితే.. ఇది జెమీమా ఒప్పుకుంటేనే జరుగుతుందన్నాడు.
View this post on Instagram
దీనిపై తాజాగా జెమీమా స్పందించింది. గవాస్కర్ సర్ మీ సందేశం చూశాను. భారత్ ప్రపంచకప్ గెలిస్తే మనిద్దరం కలిసి పాట పాడుదాం అన్నారు కదా.. నేను గిటార్‌తో సిద్ధంగా ఉన్నాను. మరీ మీరు మైక్‌తో సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నా. అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో జెమీమా రోడ్రిగ్స్ పోస్ట్ చేసింది. మరి దీనిపై సునీల్ గవాస్కర్ ఎలా స్పందిస్తారో.

ఇదిలా ఉంటే.. రెండేళ్ల కిందట బీసీసీఐ నామన్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో వీరిద్దరు కలిసి పాడిన సంగతి తెలిసిందే.
