Rahul Dravid : అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ.. సి టీమ్‌లో ద్రవిడ్ చిన్న కొడుకు
పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారుడు అన్వయ్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నాడు.
                            Rahul Dravid younger son Anvay set to play in Under 19 One Day Challenger Trophy
Rahul Dravid : పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ హైదరాబాద్ వేదికగా నవంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే నాలుగు జట్లను ప్రకటించారు. ఇందులో ఓ జట్టులో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అయిన అన్వయ్ టీమ్ సి తరుపున ఆడనున్నాడు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మెన్స్ అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ హైదరాబాద్ వేదికగా నవంబర్ 5 నుంచి 11 వరకు జరగనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ టోర్నీలో పాల్గొనే నాలుగు జట్లు.. ఏ, బీ, సీ, డీ లను జూనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. ఏ టీమ్ కెప్టెన్‌గా విహాన్ మల్హోత్రా, బీ టీమ్ కెప్టెన్‌గా వేదాంత్ త్రివేది, సీ టీమ్ కెప్టెన్‌గా అరోన్ జార్జ్, డి టీమ్ కెప్టెన్‌గా చంద్రహాస్ డాష్ లు ఎంపిక అయ్యారు.
ఇదిలా ఉంటే.. అన్వయ్ ద్రవిడ్ అన్న సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటరే. అతడు మహారాజా టీ20 కేఎస్‌సీఏ ట్రోఫీలో కర్ణాటక తరుపున ఆడాడు.
టీమ్ ఏ..
విహాన్ మల్హోత్రా (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్), వంశ్ ఆచార్య, బాలాజీ రావు (వికెట్ కీపర్), లక్ష్య రాయచందాని, వినీత్ వీకె, మార్కండే పంచాల్, సాత్విక్ దేస్వాల్, యశ్వీర్, హేమచుదేశన్, అంబరీష్, హనీ దేవా గూఢానీ, హనీ ప్రతాప సింగ్.
టీమ్ బి..
వేదాంత్ త్రివేది (కెప్టెన్), హర్వాన్ష్ సింగ్ (వైస్ కెప్టెన్), వాఫీ కచ్చి, సాగర్ విర్క్, సయన్ పాల్, వేదాంత్ సింగ్ చౌహాన్, ప్రణవ్ పంత్, ఎహిత్ సలారియా (వికెట్ కీపర్), కిషోర్, అన్మోల్జీత్ సింగ్, నమన్ పుష్పక్, దీపేష్, మహమ్మద్ శర్వా మలీబ్, మహమ్మద్ వాసివ్ సాలీబ్.
టీమ్ సీ..
ఆరోన్ జార్జ్ (కెప్టెన్), ఆర్యన్ యాదవ్ (వైస్ కెప్టెన్), అంకిత్ ఛటర్జీ, మణికాంత్ శివానంద్, రాహుల్ కుమార్, యశ్ కస్వాంకర్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్ (వికెట్ కీపర్), ఖిలాన్ ఎ పటేల్, కనిష్క్ చౌహాన్, ఆయుష్ శుక్లా, హెనిల్ కుమార్ దథి, రోహి మోత్రు దత్తి, లక్ష్మణ్ పటేల్.
టీమ్ డీ..
చంద్రహాస్ డాష్ (కెప్టెన్), మౌల్యరాజ్‌సింగ్ చావ్డా (వైస్ కెప్టెన్), శంతను సింగ్, అర్నవ్ బుగ్గ, అభినవ్ కన్నన్, కుషాగ్రా ఓజా, ఆర్యన్ సక్పాల్ (వికెట్ కీపర్), ఎ రాపోల్ (వికెట్ కీపర్), వికల్ప్ తివారీ, మొహమ్మద్ ఈనాన్, అయాన్ అక్రమ్, ఉదవ్ మోహన్, అశుతోష్ తవ్‌క్, అశుతోష్, తవ్క్.
