Mohammed Shami: 30కిలోమీటర్లు సైకిల్ తొక్కి తీసుకెళ్లేవారంటూ తండ్రిని గుర్తు చేసుకున్న షమీ
ఆరోసారి 5వికెట్లు పడగొట్టి.. 200వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత సాధించాడు. షమీ దూకుడుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా 197పరుగులకే ఆలౌట్ అయ్యారు.

Miohammed Shami
Mohammed Shami: టీమిండియా ఫేసర్ అరుదైన క్లబ్ లో జాయిన్ అయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో మరోసారి 5వికెట్లు పడగొట్టాడు. ఆరోసారి 5వికెట్లు పడగొట్టి.. 200వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత సాధించాడు. షమీ దూకుడుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా 197పరుగులకే ఆలౌట్ అయ్యారు.
ఈ సందర్భంగా తాను ఈ స్థాయికి రావడానికి తన తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు షమీ. ఉత్తరప్రదేశ్ లోని అల్మోరా జిల్లాలో సాహస్పూర్ గ్రామానికి చెందిన ఫాస్ట్ బౌలర్.. అప్పట్లో ఇంటర్నేషనల్ క్రికెటర్ కావడానికి అందుబాటులో ఎటువంటి ఫెసిలిటీలు ఉండేవి కావట. 2017లో మరణించిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తనని కోచింగ్ క్యాంప్ కు తీసుకెళ్లడానికి 30కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడని అన్నారు.
తన తండ్రి చేసిన త్యాగానికి తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. ‘టీవీలో కనిపిస్తున్న ప్లేయర్ గా అవ్వాలనుకుని కష్టపడే సమయంలో మీరెంత సాధిస్తారో ఎవ్వరూ అంచనా వేయలేరు. బాగా కష్టపడండి.. ఫలితాలు కూడా అలాగే వస్తాయి’ అని టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు షమీ.
ఇది కూడా చదవండి : డోన్‌లో క్షుద్రపూజల కలకలం
టెస్ట్ మ్యాచ్ అంటే అదేమీ రాకెట్ సైన్స్ కాదు అర్థం కాకపోవడానికి. టెస్టు స్థాయి బౌలర్ అయితే.. మీ లెంగ్త్, పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేయడాన్ని అలవాడు చేసుకోవాలని’ షమీ అన్నారు.
మహ్మద్ షమీ టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 55 టెస్టుల్లో షమీ 200 వికెట్ల మార్క్‌ను చేరుకోగలిగాడు. 50 టెస్టుల్లో కపిల్ దేవ్ 200 వికెట్ల మార్క్ సాధించి తొలి స్థానంలో నిలవగా.. జగవల్ శ్రీనాథ్(54 టెస్టుల్లో) రెండో స్థానం, షమీ(55 టెస్టులు) మూడో స్థానం, 63 టెస్టులతో నాలుగో స్థానంలో జహీర్‌ఖాన్, ఇషాంత్ శర్మలు సంయుక్తంగా నిలిచారు.
ఇది కూడా చదవండి : ఏపీ లో రానున్న రెండురోజుల్లో వర్షాలు