IPL 2025: నిప్పులుచెరిగే బంతులతో సన్‌రైజర్స్ బ్యాటర్లను అల్లాడించిన సిరాజ్.. ఐపీఎల్ లో అరుదైన రికార్డు నమోదు
మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో సన్ రైజర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన సిరాజ్..

Mohammed Siraj
IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ కు సన్ రైజర్స్ బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవలేక పోయారు.
లోకల్ బాయ్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో సన్ రైజర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన సిరాజ్.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. సన్ రైజర్స్ డేంజరెస్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(18), ట్రావిస్ హెడ్ (8) తక్కువ పరుగులకే పెవిలియన్ కు పంపించిన సిరాజ్.. చివరిలో అనికెత్ శర్మ (18), షిమర్జీత్ సింగ్ (0)లను ఔట్ చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో అరుదైన ఘనతను సాధించాడు.
Also Read: IPL 2025 : మారని హైదరాబాద్ తీరు.. వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్ చరిత్రలో 100 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్ లో మహమ్మద్ సిరాజ్ చేరాడు. అభిషేక్ శర్మ వికెట్ ను పడగొట్టడం ద్వారా సిరాజ్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే, ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 26వ బౌలర్ గా సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. సిరాజ్ మొత్తం 97 మ్యాచ్ లలో 100 వికెట్లు పడగొట్టాడు. అందులో 42 వికెట్లు పవర్ ప్లేలోనే తీశాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో సిరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు అతడు ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఏడు వికెట్లు పడగొట్టాడు.
The wicket that started it all ⚡pic.twitter.com/zIkvbFm3tN
— Gujarat Titans (@gujarat_titans) April 6, 2025
2017లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తన ఐపీఎల్ కెరీర్ ను ప్రారంభించిన మహమ్మద్ సిరాజ్.. ఆరు మ్యాచ్ లు ఆడి 21.20 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. 2018 సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం 2.20కోట్లకు సిరాజ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్సీబీ తరపున 87 మ్యాచ్ లు ఆడిన సిరాజ్.. 31.44 సగటుతో 83 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలంలో సిరాజ్ ను రూ.12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
A special 💯
Siraj registers 1⃣0⃣0⃣th #TATAIPL wicket ☝️
🔽 Watch | #SRHvGT | @mdsirajofficial
— IndianPremierLeague (@IPL) April 6, 2025