IPL 2025: బుమ్రా సరే.. రోహిత్ శర్మ పరిస్థితి ఏమిటి..? హిట్‌మ్యాన్‌ను పక్కన పెట్టినట్లేనా.. బిగ్ అప్‌డేట్‌

జట్టులోకి బుమ్రా ఎంట్రీ స్పష్టత వచ్చినా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులో చేరతాడా.. లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

IPL 2025: బుమ్రా సరే.. రోహిత్ శర్మ పరిస్థితి ఏమిటి..? హిట్‌మ్యాన్‌ను పక్కన పెట్టినట్లేనా.. బిగ్ అప్‌డేట్‌

Rohit Sharma and Jasprit Bumrah

Updated On : April 7, 2025 / 7:54 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025లో హార్దిక్ పాండ్య సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుస ఓటములను చవిచూస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ లోనే ఆ జట్టు విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో నిలిచింది. అయితే, ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం ఏమిటంటే ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. సోమవారం రాత్రి ఆర్సీబీ జట్టుతో జరిగే మ్యాచ్ లో ముంబై తుది జట్టులో చేరబోతున్నాడు.

Also Read: IPL 2025 : మారని హైదరాబాద్ తీరు.. వరుసగా నాలుగో ఓటమి

ప్రస్తుతం ముంబై జట్టు బౌలింగ్ విభాగాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్య ముందుండి నడిపిస్తున్నాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ లు కూడా ఉన్నారు. అయితే, దీపక్ చాహర్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో, డెత్ ఓవర్లలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్ల దూకుడును కట్టడి చేయడంలో ముంబై బౌలింగ్ విభాగం విఫలమవుతోందని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం బుమ్రా లాంటి అద్భుతమైన బౌలర్ తుది జట్టులో చేరుతుండటం ముంబై జట్టులో కొత్త జోష్ ను నింపినట్లే అవుతుంది. అయితే, జట్టులోకి బుమ్రా ఎంట్రీ స్పష్టత వచ్చినా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులో చేరతాడా.. లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Also Read: SRH vs GT: ఉప్పల్‌ మ్యాచ్‌పై సన్‌రైజర్స్ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఆసక్తికర కామెంట్స్‌

రోహిత్ శర్మ ఐపీఎల్ ప్రారంభం నుంచి పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నాడు. ముంబై ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు మ్యాచ్ లలో ఆడిన రోహిత్ శర్మ ఓపెనర్ గా క్రీజులోకి వచ్చి పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ బాటపడుతూ వచ్చాడు. దీంతో లక్నో మ్యాచ్ సమయంలో ముంబై యాజమాన్యం రోహిత్ శర్మను పక్కన పెట్టింది. అయితే, రోహిత్ శర్మను కావాలని పక్కనపెట్టలేదని, అతను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోకాలికి గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కలేదని ముంబై హెడ్ కోచ్ మహేల జయవర్దనే తెలిపాడు.

 

సోమవారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆడే విషయంపై అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జయవర్ధనే మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఆర్సీబీపై ఆడే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ సాధనలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదని చెప్పాడు. అయితే, రోహిత్ ను బ్యాటింగ్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో బుమ్రా, రోహిత్ శర్మలు తుది జట్టులో చేరతారో లేదో చూడాల్సిందే.