SRH vs GT: ఉప్పల్ మ్యాచ్‌పై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆసక్తికర కామెంట్స్
ఇటీవలే ఈ గ్రౌండ్‌లో 280 పరుగులు చేశామని చెప్పాడు.

PIC: @IPL (X)
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
ఈ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. “తొలుత బ్యాటింగ్ చేయడం మాకు సంతోషాన్నిచ్చే విషయమే. మేము దూకుడుగా ఆడాలనుకుంటున్నాం. ఈ గ్రౌండ్‌లో బ్యాటింగ్‌కు మేము ప్రాధాన్యం ఇస్తాం. ఇటీవలే ఈ గ్రౌండ్‌లో 280 పరుగులు చేశాము. మేము మా వంతు కృషి చేయాలి. మా బలాలపై దృష్టి పెట్టాలి. హర్షల్ పటేల్ అనారోగ్యంతో ఉండడంతో ఆడడం లేదు. జేదేవ్ ఉనద్కత్ ఆడుతున్నాడు” అని చెప్పాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్స్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్
గుజరాత్ టైటాన్స్ జట్టు: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అర్షద్ ఖాన్