ధోనీ లేని సూపర్ కింగ్స్.. ఆర్సీబీ లాంటిది

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమికి గురైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 133 పరుగులు మాత్రమే చేసి అత్యల్ప టార్గెట్‌ను నమోదు చేసింది.

ధోనీ లేని సూపర్ కింగ్స్.. ఆర్సీబీ లాంటిది

Updated On : April 18, 2019 / 10:49 AM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమికి గురైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 133 పరుగులు మాత్రమే చేసి అత్యల్ప టార్గెట్‌ను నమోదు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమికి గురైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 133 పరుగులు మాత్రమే చేసి అత్యల్ప టార్గెట్‌ను నమోదు చేసింది. చేధనకు దిగిన హైదరాబాద్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోవడంతో 5వికెట్ల తేడాతో చెన్నై ఓటమికి గురైపోయింది.

ఈ పరాజయం పట్ల ధోనీ అభిమానులు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు. మ్యాచ్ జరిగిన అనంతరం అంబటి రాయుడు.. డేవిడ్ వార్నర్ ఫొటోను పోస్టు చేస్తూ.. రాయుడు ప్యాంట్ జేబులో వార్నర్ 3D కళ్లజోడు కోసం వార్నర్ వెతుకుతున్నాడేమో.. అని ఒకరంటే.. వరల్డ్ కప్ జట్టు ప్రకటించిన వెంటనే ధోనీ విశ్రాంతి తీసుకున్నాడు. ఇందులో ఏదో తెలియాల్సి ఉంది’ అనే అనుమానం వ్యక్తం చేశాడు. 
Also Read : వింతల్లో వింత : 8 ఏళ్ల బాలుడి కడుపులో పిండం.. డాక్టర్లు షాక్

ధోనీ లేని చెన్నై సూపర్ కింగ్స్ .. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లాంటిది’ అని కౌంటర్ వేసే వాళ్లతో పాటు ధోనీ లేని జట్టును ఊహించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ.. సూపర్ కింగ్స్ జట్టుపై సానుభూతి వ్యక్తం చేస్తున్న వాళ్లు లేకపోలేదు.