MS Dhoni : సీఎస్‌కేలో చోటు కోరిన‌ క‌మెడియ‌న్.. ధోని రియాక్ష‌న్ వైర‌ల్‌

టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి యోగిబాబుకు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ నెటీజ‌న్లను ఆక‌ట్టుకుంటోంది.

MS Dhoni : సీఎస్‌కేలో చోటు కోరిన‌ క‌మెడియ‌న్.. ధోని రియాక్ష‌న్ వైర‌ల్‌

MS Dhoni Reply To Yogi Babu

MS Dhoni Reply To Yogi Babu : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni)గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క్రికెట్‌లో ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన మ‌హి సినీ నిర్మాత‌గా కొత్త అవ‌తారం ఎత్తాడు. ధోని ఎంటర్టైన్‌మెంట్‌ (Dhoni Entertainment) పేరిట నిర్మాణ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. తొలి సినిమాగా ‘లెట్స్ గెట్ మ్యారీడ్ ‘(LGM) ని రూపొందించారు.

సోమ‌వారం చెన్నైలో ఈ చిత్ర ట్రైల‌ర్‌, ఆడియో లాంఛ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. LGM సినిమాలో త‌మిళ స్టార్ క‌మెడియ‌న్ యోగిబాబు ఓ పాత్ర‌లో న‌టించారు. ఇత‌ను మ‌హేంద్రుడికి పెద్ద అభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో యోగిబాబుకి ధోని మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ నెటీజ‌న్లను ఆక‌ట్టుకుంటోంది.

ICC World Cup 2023 : ఒక వేళ పాకిస్తాన్ ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌కుంటే.. ఆ జ‌ట్టు స్థానంలో ఆడేది ఎవరంటే..?

యోగిబాబు మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులోకి త‌న‌ను తీసుకోవాల‌ని ధోని ని కోరారు. అయితే.. మ‌హి కూడా అంతే స‌ర‌దాగా స్పందించాడు. ‘చెన్నై జ‌ట్టులో కీల‌క ఆట‌గాడు అయిన అంబ‌టి రాయుడు (Ambati Rayudu) ఇటీవ‌లే రిటైర్ అయ్యాడు. కాబ‌ట్టి ఆ స్థానం ఖాళీగానే ఉంది. నేను మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతాను. మీరు నిల‌క‌డ‌గా ఆడాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అయితే.. మీరు సినిమాల‌తో బిజీగా ఉంటారు క‌దా..? ఇక్క‌డ మీరు ఓ విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్లు మిమ్మ‌ల్ని గాయ‌ప‌ర‌చాల‌ని మాత్ర‌మే బౌలింగ్ వేస్తారు.’ అని ధోని అన‌డంతో అక్క‌డ ఒక్క‌సారిగా న‌వ్వులు పూశాయి.

ఇక LGM సినిమా విష‌యానికి వ‌స్తే.. హ‌రీశ్ కల్యాణ్,ఇవానా లు జంట‌గా న‌టించారు. రమేష్‌ తమిళమణి దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ధోని, అత‌డి స‌తీమ‌ణి సాక్షి చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ ఆక‌ట్టుకుంటోంది.

LGM Trailer : ట్రైలర్ లాంచ్ చేసిన ధోని.. పెళ్ళికి ముందు అత్తని అర్ధం చేసుకోవాలి అంటున్న కోడలు..

యోగిబాబు కోసం బ్యాట్ పంపిన ధోని

ధోని త‌న అభిమానుల‌కు ఏదో ఒక‌టి పంపిస్తూ స‌ర్‌ప్రైజ్ చేస్తాడు అన్న సంగ‌తి తెలిసిందే. అలాగే త‌న‌కు పెద్ద అభిమాని అయిన క‌మెడియ‌న్ యోగిబాబుకు త‌న ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను గ‌తంలో ధోని పంపించాడు. ఆ సంద‌ర్భంగా యోగిబాబు చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. చాలా సంతోషంగా ఉంద‌ని, స్వ‌యంగా ధోనినే త‌న కోసం బ్యాట్‌ను పంప‌డం ఎన్న‌టికి మ‌రిచిపోలేన‌న్నాడు. దీన్ని ఎప్ప‌టికి దాచుకుంటా. థ్యాంక్యూ స‌ర్ అంటూ యోగిబాబు ట్వీట్ చేశారు.

MSD send bat to Yogi Babu

MSD send bat to Yogi Babu