ధోనీ చేతుల్లో గమ్ ఉందా.. రోహిత్ అవుట్?

ధోనీ చేతుల్లో గమ్ ఉందా.. రోహిత్ అవుట్?

Updated On : April 4, 2019 / 3:52 AM IST

యావత్ క్రికెట్ ప్రపంచమంతా చెప్పే మాట. మహేంద్ర సింగ్ ధోనీ స్టంప్స్ వెనుక హీరో. ఎలాంటి బ్యాట్స్ మన్ అయినా ధోనీ రెప్పపాటు కదలికల ముందు చిత్తు కావాలసిందే. బుధవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ అదే జరిగింది. చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లో చెన్నైపై విజయం సాధించాలని టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. రోహిత్.. డికాక్ జోడీ.

ఆరంభంలోనే తడబడిన డికాక్.. తొలి వికెట్ కోల్పోగా రెండో వికెట్ గా రోహిత్ శర్మను చేజిక్కించుకుంది. ఎనిమిదో ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్ వేస్తుండగా వికెట్ కీపర్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ..  రోహిత్ శర్మ హిట్టింగ్ చేసిన స్పిన్ బంతిని క్యాచ్ అందుకోవడంతో పాటు మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేశాడు. 

క్రీజులో నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో రోహిత్ శర్మ 18 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 12 మొదలైనప్పటి నుంచి పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుస మ్యాచ్ లలో 14, 48, 32, 13 పరుగులు చేయగలిగాడు. ఎట్టకేలకు వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై 37 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. తర్వాతి మ్యాచ్ ను హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ తో ఏప్రిల్ 6న తలపడనుంది.