ధోనీ లాస్ట్ బాల్ వదిలేస్తాడని ఊహించలేదు

ధోనీ లాస్ట్ బాల్ వదిలేస్తాడని ఊహించలేదు

Updated On : April 22, 2019 / 8:28 AM IST

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరి బాల్ వదిలేస్తాడని ఊహించలేదని ఆర్సీబీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంటున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ చివరి బాల్‌కు పరుగులు చేయకపోవడంతో చెన్నై ఒక్క పరుగు తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమికి గురైంది. 

కానీ, ఆ చివరి బంతిని ధోనీ అంత ఈజీగా వదిలేస్తాడని పార్థివ్ పటేల్ ఊహించలేదట. ‘మిగిలింది ఒకే ఒక్క బాల్. జట్టు గెలవాలంటే రెండు పరుగులు కావాలి. ఈ పరిస్థితుల్లో ధోనీని ఆఫ్ సైడ్ హిట్ చేసేలా వ్యూహం పన్నాం. ఎందుకంటే లెగ్ సైడ్ కొడితే కచ్చితంగా 2పరుగులు చేసేస్తాడని అందరికీ తెలుసు. ఉమేశ్ యాదవ్‌ని నెమ్మెదిగా వేసి ఆఫ్ సైడ్ కొట్టేలా చేయాలని చెప్పాం’

ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా వచ్చిన బంతిని ధోనీ అనూహ్యంగా వదిలేశాడు. అది ఎవరూ ఊహించి ఉండరు. ధోనీ ఆ బంతిని వదలడం ఆశ్చర్యానాకి గురి చేసింది. ముందునుంచి మహీకి డాట్ బాల్స్ వేయాలని ప్రయత్నించాం. అతని సంగతి తెలియని వారెవరుంటారు. ఒత్తిడికి గురి చేయాలని అనుకుంటే ఎదురుదాడి చేశాడు’ అని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన పార్థివ్ పటేల్ వెల్లడించాడు.