MS Dhoni : ధోని ఐపీఎల్ 2025 ఆడడం పై సీఎస్‌కే సీఈఓ వ్యాఖ్యలు వైరల్.. తలాను మైదానంలో చూస్తామా?
ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అయితే.. ఈ సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్నారు.

MS Dhoni Not Confirmed For IPL 2025 Yet CSK CEO Drops Major Bombshell
MS Dhoni : ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అయితే.. ఈ సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను అక్టోబర్ 31లోపు తెలపాలని బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో అన్ని ఫ్రాంచైజీలు ఈ పనిలో నిమగ్నం అయ్యాయి. ఇక టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని వచ్చే ఐపీఎల్‌లో అడుతాడా? లేదా? అనే ఉత్కంఠ అందరిలో ఉంది.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి అయిదేళ్లు గడిచిన ఆటగాళ్లని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తూ గతంలో ఉన్న నిబంధనను మళ్లీ అమల్లోకి తీసుకువచ్చింది బీసీసీఐ. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు లాభం చేకూరుస్తుంంది. ఈ నిబంధనతో ధోనిని రూ.4కోట్లకే సొంతం చేసుకోవచ్చు. ధోని కోసమే ఈ నిబంధనను బీసీసీఐ తీసుకువచ్చిందనే వాదనలు వినిపించాయి.
David Cameron : విరాట్ కోహ్లీ పై బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ కామెంట్స్..
ఇదిలా ఉంటే.. ధోని రిటెన్షన్ పై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వచ్చే సీజన్‌లో ఆడేది లేనిది అనే విషయం ధోని ఇంత వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అక్టోబర్ 31 లోపు చెబుతాను అని ధోని అన్నట్లుగా తెలిపాడు. అతడు ఆడతాడనే తాము ఆశిస్తున్నట్లు విశ్వనాథన్ అన్నారు.
గత ఐపీఎల్ సీజన్‌కు ముందు ధోని చెన్నై సూపర్ కింగ్స్ బాధ్యతలను వదిలి వేశాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు నాయకత్వ బాధ్యతలను అప్పగించాడు. ఆ సీజన్‌లో మోకాలి గాయంతోనే బాధపడుతూనే ఆడాడు. సీజన్ ముగిసిన వెంటనే తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
Cheteshwar Pujara : శతకంతో చెలరేగిన పుజారా.. బ్రియాన్ లారా రికార్డు బద్దలు.. రీఎంట్రీ ఇచ్చేనా?