ధోనీ వార్నింగ్: వికెట్ల వెనుక ఉండేది నేనే.. చూసుకుందాం రా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 12 మొదలయ్యేందుకు నెల రోజుల సమయమున్నా.. అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్ ఇప్పుడే మొదలైపోయింది.

ధోనీ వార్నింగ్: వికెట్ల వెనుక ఉండేది నేనే.. చూసుకుందాం రా

Updated On : February 28, 2019 / 11:11 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 12 మొదలయ్యేందుకు నెల రోజుల సమయమున్నా.. అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్ ఇప్పుడే మొదలైపోయింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 12 మొదలయ్యేందుకు నెల రోజుల సమయమున్నా.. అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్ ఇప్పుడే మొదలైపోయింది. వారికి తగ్గట్టుగానే ఫ్రాంచైజీలు అదే స్థాయిలో ప్రచారంతో ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. ఈ మధ్యనే రిషబ్ పంత్.. ఎంఎస్ ధోనీకి వార్నింగ్ ఇస్తున్నట్లుగా చేసిన వీడియోను విడుదల చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ముందడుగేస్తే.. ధీటుగా సమాధానం చెప్తూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో వీడియో విడుదల చేశాడు. 
Read Also : బీసీసీఐ వార్నింగ్ : ఐపీఎలా.. పీఎస్ఎలా.. ఏదో ఒకటి తేల్చుకోండి

‘మహీ భాయ్.. అన్నీ నీ నుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు నీ ముందే ఆడేందుకు సిద్ధమవుతున్నాను. ఐపీఎల్‌లో కలుసుకుందాం. ఏమంటావ్..’ అని ఢిల్లీ యువ సంచలనం రిషబ్‌పంత్ ట్వీట్ చేశాడు. 

దానికి స్పందంచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ‘నేను ఆడటం మొదలుపెట్టినప్పుడు ఇలాగే అనుకునేవాడిని. రా రిషబ్. వికెట్ వెనకాల నేనే ఉంటాగా చూసుకుందాం’ అని ఐపీఎల్‌కు బయల్దేరుతున్నట్లుగా ఉన్న వీడియోలో ధోనీ కనిపించాడు. పంత్ వీడియోతో కంటే ధోనీ వీడియో మరింత వేగంగా వైరల్ అవుతోంది. 

కొద్ది రోజుల ముందు బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఐపీఎల్ మార్చి 23నుంచి ఆరంభం కానుంది. సొంతగడ్డపైనే సీజన్ ఆరంభిస్తున్న చెన్నై.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 
Read Also : ద్రవిడ్ సలహాలే ఫామ్‌ను తెచ్చిపెట్టాయి: కేఎల్ రాహల్