MS Dhoni: అయ్యయ్యో జస్ట్ మిస్.. హోండా బైక్‌పై ధోనీ.. సెల్ఫీకి ప్రయత్నించిన అభిమాని.. వీడియో వైరల్
రాంచీలో ఉంటున్న ధోనీ.. బైక్‌పై తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. దీనిని గమనించిన ఓ అభిమాని సెల్ఫీకోసం ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mahendra Singh Dhoni
Mahendra Singh Dhoni : టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగినప్పటికీ ధోనీకి ఏమాత్రం క్రేజ్ దగ్గలేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నీలో సీఎస్‌కే జట్టుకు సారధిగా వహించిన ధోనీ.. జట్టుకు ట్రోపీ అదించాడు. అయితే, ధోనీ ఎక్కడ కనిపించినా సెల్ఫీలకోసం అభిమానులు పోటీపడతారు. తాజాగా ధోనీ రాంచీలో తన హోండా రెపెసోల్ 150( బైక్)పై రైడింగ్ చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీకోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేంద్ర సింగ్ ధోనీకి బైక్‌లు, కార్లు అంటే ఎంతో ఇష్టం. పదుల సంఖ్యలో బైక్‌లు, కార్లు ధోనీ తన గ్యారేజ్‌లో దర్శనమిస్తాయి. పలు సార్లు తనకు బైక్‌పై రైడింగ్ అంటే చాలా ఇష్టమని ధోనీ వెల్లడించారు. ప్రస్తుతం రాంచీలో ఉంటున్న ధోనీ.. బైక్‌పై రాంచీలోని తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఉన్న ఓ అభిమాని ధోని బైక్ పై రావడాన్ని గమనించి సెల్ఫీకోసం ప్రయత్నించాడు. అప్పటికే ధోనీ ఇంటి గేటులోకి వెళ్లిపోవటం వీడియోలో కనిపించింది. ధోనీ హెల్మెంట్ పెట్టుకొని ఉన్నాడు. ధోనీ బైక్ పై వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram