కొత్త లుక్‌లో ధోనీ: ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బంది పెట్టిన అభిమానులు

ఆర్మీలో సైనిక విధులు ముగించుకుని వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త లుక్‌లో కనిపించాడు. ఇటీవల ఖద్దరు దుస్తుల్లో కనిపించిన ధోనీ రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అప్పటి ధోనీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.
దీంతో ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలికుతున్నారా? అనే అనుమానాలు కూడా అభిమానులు వ్యక్తం చేశారు. అయితే అది యాడ్ షూటింగ్ కోసం తెలిసిందే. ఇదిలా ఉంటే ధోనీ మరో కొత్త లుక్‌లో లేటెస్ట్‌గా అభిమానులకు కనిపించాడు.
జైపూర్ విమానాశ్రయంలో తలకు గుడ్డ కట్టుకుని, టీ-షర్ట్‌లో కనిపించిన ధోనీ జైపూర్‌లో ఓ వేడుకకు హాజరై వస్తున్నట్లుగా తెలిసింది. తన అభిమానులకు ఫొటోలకు పోజులిచ్చిన ధోనీ తలకు నల్లటి గుడ్డ కట్టుకుని ఉండగా.. అప్పటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ధోనీ వచ్చిన విషయం జైపూర్ విమానాశ్రయంలో అందరికీ తెలియడంతో.. అందరూ ఒక్కసారిగా ధోనీని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడి సెక్యురిటీ సిబ్బందికి వారిని కంట్రోల్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది.
ధోనీ కూడా అభిమానులు ఒక్కసారిగా రావడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. ధోనీని తన కారులో తీసుకురావడానికి భద్రతా సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. మునుపెన్నడూ చూడని గెటప్‌లో ఉన్న ధోనీ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వర్తించడం కోసం ధోనీ ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ పర్యటనకు కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. లెఫ్ట్‌నెంట్ కల్నల్ అయిన ధోనీ భారత సైన్యంలో చేరి విధులు నిర్వర్తించారు. 15 రోజులు లెహ్‌లో విధులు నిర్వర్తించి తర్వాత బయటకు వచ్చాడు ధోనీ.