చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఖాళీ సమయం దొరికితే స్టేడియంలోని పచ్చికపై విశ్రాంతి తీసుకుంటాడనే సంగతి తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఖాళీ సమయం దొరికితే స్టేడియంలోని పచ్చికపై విశ్రాంతి తీసుకుంటాడనే సంగతి తెలిసిందే. కొన్ని సార్లు ఎయిర్ పోర్టులోని నేలమీద పడుకుని కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సారి మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అతని భార్య సాక్షి ధోనీ కూడా నేల మీద పడుకుండిపోయారు. బ్యాగ్ నే తలదిండుగా చేసుకుని ఎయిర్ పోర్టులో విశ్రాంతి తీసుకున్నారు.
Read Also : కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు ఉంటాయా
ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఐపీఎల్ టైమింగ్ వల్ల మేం పడుతున్న కష్లాలిలా ఉన్నాయి. ఉదయం ఫ్లైట్ అందుకోవాలంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి’ అని పోస్టు చేశాడు. మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో చెపాక్ స్టేడియం వేదికగా పోరాడిన చెన్నై సూపర్ కింగ్స్.. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా తలపడాల్సి ఉంది.
ఈ క్రమంలో కోల్ కతాపై 7 వికెట్ల విజయం అనంతరం మంగళవారం రాత్రి పడుకొని బుధవారం ఉదయాన్నే రాజస్థాన్ బయల్దేరింది చెన్నై జట్టు. ఈ సందర్బంలో తీసిన ఫొటోను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు మహేంద్రుడు.
Read Also : వరల్డ్ కప్ ముంగిట రోహిత్ శర్మకు గాయం