Cricket World Cup 2023: వన్డే ప్రపంచ కప్-2011 ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియానికి మెరుగులు.. ఎందుకంటే?

భారత్ ఆడే మ్యాచుల్లో ఒక మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది. అలాగే...

Cricket World Cup 2023: వన్డే ప్రపంచ కప్-2011 ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియానికి మెరుగులు.. ఎందుకంటే?

Wankhede Stadium

Updated On : June 22, 2023 / 6:13 PM IST

Cricket World Cup 2023- Mumbai: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరిగే వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కోసం దేశంలోని స్టేడియాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో కొత్త ఎల్ఈడీ (LED) ఫ్లడ్‌లైట్లను అమర్చనున్నారు.

ఇందుకు టెండర్లను ఆహ్వానించారు. అలాగే, అతిథులు కూర్చొనే హాస్పిటాలిటీ బాక్సుల పునర్నిర్మాణం కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (Maharashtra Cricket Association) ఇందుకు సంబంధించిన సంస్థల నుంచి దరఖాస్తులు కోరింది. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వాంఖడే స్టేడియంలోనే జరిగింది.

ఆ మ్యాచులో శ్రీలంకను భారత్ ఓడించి విజేతగా నిలిచింది. 2023 ప్రపంచ కప్ కు మరో మూడు నెలలే సమయం ఉండడంతో ఆలోగా పనులన్నీ పూర్తి చేయడానికి ప్రణాళికలు వేసుకుంది. వాంఖడే స్టేడియంతో పాటు మరో నాలుగు క్రికెట్ స్టేడియాలను మరింత మెరుగుపర్చేందుకు పనులు చేయించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

భారత్ ఆడే మ్యాచుల్లో ఒక మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది. అలాగే, ఈ స్టేడియంలో ఒక సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఐపీఎల్ -2023 లీగ్ మ్యాచుల్లో ఏడు మ్యాచులు వాంఖడే స్టేడియంలో జరిగాయి.

T20 Blast 2023: అయ్యయ్యో.. ఇలా ఔట్ అయ్యాడేంటి! ఇలాంటి క్యాచ్ మీరెప్పుడైనా చూశారా? వీడియో వైరల్