Rohit sharma: జైస్వాల్‌ను ఆపడం మాతరం కాలేదు .. ఇన్నింగ్స్ బ్రేక్‌లో అసలు విషయం అడిగేశా..

జైస్వాల్‌ను గత సంవత్సరం చూశాను. తన అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఈ ఏడాది అంతకు రెట్టింపు ఆడుతున్నాడని రోహిత్ ప్రశంసించారు.

Rohit sharma: జైస్వాల్‌ను ఆపడం మాతరం కాలేదు .. ఇన్నింగ్స్ బ్రేక్‌లో అసలు విషయం అడిగేశా..

Jaiswal and Rohit Sharma

Updated On : May 1, 2023 / 12:35 PM IST

Rohit sharma: ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. చివరి ఓవర్ వరకు ఏ జట్టు విజయం సాధిస్తుందో చెప్పలేని పరిస్థితి. నువ్వానేనా అన్నట్లుగా జట్ల మధ్య పోటీ సాగుతుంది. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. యువ బ్యాటర్ యశశ్వి జైస్వాల్ 62 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు. అద్భుత ఆటతీరుతో సెంచరీ సాధించాడు.

IPL 2023, MI Vs RR: య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ వృథా.. దంచికొట్టిన సూర్య‌కుమార్, టిమ్ డేవిడ్‌.. రాజ‌స్థాన్‌పై ముంబై గెలుపు

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జైస్వాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైస్వాల్‌ను గత సంవత్సరం చూశాను. తన అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఈ ఏడాది అంతకు రెట్టింపు ఆడుతున్నాడని రోహిత్ ప్రశంసించారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అతన్ని ఆపడం మా వల్ల కాలేదని రోహిత్ అన్నారు. జైస్వాల్ అద్భుత ఫామ్ లో ఉండటం, రాజస్థాన్‌తో పాటు భారత క్రికెట్‌కు కూడా చాలా మంచిదని రోహిత్ తెలిపారు. అయితే, ఇన్నింగ్స్ బ్రేక్‌లో జైస్వాల్ ను కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో అంత పవర్‌ను ఎలా జనరేట్ చేస్తున్నావని అడిగానని రోహిత్ చెప్పారు.

IPL 2023, CSK vs PBKS: చెపాక్‌లో పంజాబ్‌దే విజ‌యం.. ఉత్కంఠ పోరులో చెన్నైపై ఆఖ‌రి బంతికి గెలుపు

జైస్వాల్ సమాధానమిస్తూ.. జిమ్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల సాధ్యపడుతుందని చెప్పాడని రోహిత్ అన్నారు. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో సెంచరీ చేసిన జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా జైస్వాల్ మాట్లాడుతూ.. నేను నా సెంచరీ పూర్తి చేసినప్పుడు బంతి బౌండరీకి వెళ్లిందో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను ప్రతిదానికి దేవుడికి కృతజ్ఙతలు చెప్పాను అని జైస్వాల్ అన్నారు.