Rajasthan vs Mumbai, 45th Match: టాస్ గెలిచిన ముంబై.. రాజస్థాన్ బౌలింగ్!

  • Published By: vamsi ,Published On : October 25, 2020 / 07:23 PM IST
Rajasthan vs Mumbai, 45th Match: టాస్ గెలిచిన ముంబై.. రాజస్థాన్ బౌలింగ్!

Updated On : October 25, 2020 / 7:52 PM IST

Rajasthan vs Mumbai, 45th Match: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో అబుదాబి వేదికగా జరుగుతున్న 45వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ పోలార్డ్ బ్యాటింగ్ ఎంచుకుని రాజస్థాన్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించాడు. ముంబయి జట్టుకు రోహిత్ శర్మ దూరం అవగా.. పోలార్డ్ సారధ్య బాధ్యతలు స్వీకరించాడు. కిరోన్ పొలార్డ్ వరుసగా రెండవసారి కెప్టెన్‌గా వెళ్లి టాస్ గెలిచిన తరువాత మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.



ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టులో మార్పు జరిగింది. నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో ప్లేయింగ్ పదకొండులో జేమ్స్ పాటిన్సన్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో, రాజస్థాన్ జట్టు ఎటువంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుంది.



Mumbai Indians (Playing XI):
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, పొలార్డ్ (కెప్టెన్), క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ మరియు జస్ప్రీత్ బుమ్రా.



Rajasthan Royals (Playing XI):
బెన్ స్టోక్స్, రాబిన్ ఉత్తప్ప, సంజు శాంసన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్ మరియు కార్తీక్ త్యాగి.



ప్లేఆఫ్ రేస్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిస్తే ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు గెలిస్తే అది ప్లేఆఫ్ రేసులోనే ఉంటుంది.