Mumbai Indians: ముంబై ఇండియన్స్ యాజమాన్యం కీలక నిర్ణయం.. జయవర్ధనే, జహీర్‌ఖాన్‌లకు నూతన బాధ్యతలు

ముంబై ఇండియన్స్ యజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ ప్లేయింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. మహేల జయవర్ధనే, జహీర్ ఖాన్‌కు కొత్త బాధ్యతలు అప్పగించింది.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ యాజమాన్యం కీలక నిర్ణయం.. జయవర్ధనే, జహీర్‌ఖాన్‌లకు నూతన బాధ్యతలు

Mumbai Indians

Updated On : September 14, 2022 / 5:47 PM IST

Mumbai Indians: ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన విషయం విధితమే. తాజాగా ఆ జట్టు యాజమాన్యం కీలక మార్పులు చేసింది. నాన్ ప్లెయింగ్ బృందంలో ఈ మార్పులు చేసింది. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్న మహేళ జయవర్ధనేతో పాటు ప్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్‌ఖాన్‌కు ప్రమోషన్ కల్పించింది. జహీర్ ఖాన్‌కు ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ప్రమోట్ చేసిన యాజమాన్యం.. జవర్ధనేకు ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యజమాన్యం తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా బుధవారం వెల్లడించింది.

Viral Video: దీని దుంపతెగ..! పార్టీలోకి దూసుకొచ్చిన సింహం.. యువకుడు చెట్టెక్కినా వదల్లేదు..

ఇదిలాఉంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ హెడ్ గా నియమితులైన తర్వాత మహేల జయవర్ధనే ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారు. తన కొత్త పాత్రలో భాగంగా ముంబై ఇండియన్స్ బ్యానర్ కింద ఉన్న ముంబై ఇండియన్స్ (ఐపీఎల్), ఎంఐ కేప్ టౌన్ (ఎస్ఏ20), ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20) అనే మూడు ఫ్రాంచైజీలకు సంబంధించి కోచింగ్, స్టాఫ్ కు మార్గదర్శకుడిగా జయవర్ధనే పర్యవేక్షిస్తారు. ఒకే బ్యానర్ కింద ఉన్న విభాగాలన్నింటికి తమ సేవలను అందించేందుకు, బ్రాండ్ కింద రూపొందించిన ఫ్రాంచైజీలను బలోపేతం చేసేందుకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు ముంబై ఇండియన్స్ యాజమాన్యం పేర్కొంది.

మాజీ క్రికెటర్, ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్‌ఖాన్ విషయానికొస్తే.. ఇతను మూడు ఫ్రాంచైజీల ఫ్లేయర్స్ డెవలప్మెంట్, ప్రోగ్రామ్ డెవలప్మెంట్, అలాగే న్యూ‌టాలెంట్ అన్వేషణ వంటి పలు కీలక బాధ్యతులు చూస్తాడు. జహీర్ ఖాన్, మహేలా జయవర్ధనేలకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల ఫ్రాంచైజీ యజమాని ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. మా గ్లోబల్ కోర్ టీమ్‌లో మహేలా, జహీర్లు భాగమైనందుకు నేను సంతోషంగా ఉన్నానని తెలిపారు. వీరిద్దరూ MI కుటుంబంలో అంతర్భాగంగా ఉన్నారని, క్రికెట్ MI స్ఫూర్తిని కలిగి ఉన్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మా జట్లన్నింటికి ఒకే విధమైన సహకారాన్ని అందించంచగలరని నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు.