Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఫ్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంది.. ఇలా జరిగితే చాలు..
అంతకంటే ఒక్క మ్యాచ్ అధికంగా ఓడిపోయినా ఆ జట్టు ప్లేఆఫ్‌లో స్థానం సంపాదించే అవకాశం అంతగా ఉండదు.

Pic: @mipaltan (X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్ మొత్తం 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. ప్రస్తుత సీజన్‌లో మాత్రం ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో పేలవ ప్రదర్శన కనబర్చింది.
ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్‌లో సోమవారం మధ్యాహ్నం నాటికి.. 4 మ్యాచ్‌లు ఆడి ఒకే మ్యాచులో గెలిచి, మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. నెట్ రన్ రేట్ +0.108గా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంటే కింది నుంచి మూడో స్థానంలో ఉంది.
ఇలాగైతే ప్లేఆఫ్స్‌కు చేరే ఛాన్స్..
ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌లో స్థానం సంపాదించడానికి కనీసం 16 పాయింట్లు ఉంటే ఆ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముంబై జట్టు 4 మ్యాచ్‌లు ఆడి 2 పాయింట్లు మాత్రమే సాధించింది. ముంబై జట్టు మరో 10 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
కనీసం 16 పాయింట్లు సాధించడానికి ముంబై ఇండియన్స్ మిగిలిన 10 మ్యాచ్‌లలో కనీసం 7 గెలవాలి. అంటే ఓటముల కన్నా గెలుపులు అధికంగా ఉండాలి. మూడు మ్యాచుల్లో ఓడిపోతే ఫర్వాలేదు.
అంతకంటే ఒక్క మ్యాచ్ అధికంగా ఓడిపోయినా ఆ జట్టు ప్లేఆఫ్‌లో స్థానం సంపాదించే అవకాశం అంతగా ఉండదు. ఒక వేళ నాలుగు మ్యాచులు ఓడిపోతే ఇతర జట్ల ఫలితాలపై ముంబై జట్టు ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఆ సమయంలో నెట్ రన్ రేట్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ముంబై నెట్ రన్ రేట్ +0.108గా ఉంది. దీన్ని బాగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి వచ్చే మ్యాచుల్లో ముంబై అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది.