IPL 2022: ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ అవుట్

ఐపీఎల్‌ 2022 నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తప్పుకున్నాడు. కండరాల గాయం కారణంగా తప్పుకుంటున్న సూర్య సీజన్ స్టార్టింగ్ లోనూ వేరే ఆరోగ్య సమస్యలతో తొలి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు.

IPL 2022: ఐపీఎల్ నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ అవుట్

Mumbai Indians

Updated On : May 9, 2022 / 7:55 PM IST

 

 

IPL 2022: ఐపీఎల్‌ 2022 నుంచి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తప్పుకున్నాడు. కండరాల గాయం కారణంగా తప్పుకుంటున్న సూర్య సీజన్ స్టార్టింగ్ లోనూ వేరే ఆరోగ్య సమస్యలతో తొలి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు.

“సూర్యకుమార్ యాదవ్ ఎడమ చేయిపై కండరాల ఒత్తిడి కలిగింది. ఈ సీజన్‌ నుంచి అతను తప్పుకుంటున్నాడు. BCCI వైద్య బృందంతో సంప్రదించి అతణ్ని విశ్రాంతి తీసుకోమని సూచించాం” అని ముంబై ఇండియన్స్ టీం వెల్లడించింది.

8 మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ 68 నాటౌట్‌తో మూడు హాఫ్ సెంచరీలతో సహా 303 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో జట్టుకు శుభారంభం అందించడంలో ఓపెనర్లు నిలకడ విఫలమవుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు. ముంబై లైనప్‌లో, భారత జట్టులో అత్యంత కీలకమైన బ్యాట్స్‌మెన్‌ T20 వరల్డ్ కప్ ఆడటానికి 2022 చివర్లో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది.

Read Also: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లేనా..

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్ ప్లేఆఫ్స్‌లో బెర్త్ కోసం ఇప్పటికే రేసులో నుంచి తప్పుకుంది. ఈ ఏడాది ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తొలి 8 మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత చివరి 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది ముంబై.