T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నేపాల్, ఒమన్.. ఇక మిగిలింది రెండే..
యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కు నేపాల్, ఒమన్ లు అర్హత సాధించాయి.

Nepal
T20 World Cup : యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కు నేపాల్, ఒమన్ లు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్ సెమీఫైనల్ మ్యాచుల్లో నేపాల్, ఒమన్ లు విజయం సాధించి ఫైనల్‌కు వెళ్లి టీ20 ప్రపంచకప్‌లో తమ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. దీంతో 2024 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 18 కి చేరింది. మొత్తం 20 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో మరో రెండు బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ నెలాఖరులో ముగియనున్న ఆఫ్రికా క్వాలిఫయర్ ద్వారా ఆ రెండు జట్లు ఏవో తేలిపోనుంది.
శుక్రవారం జరిగిన ఆసియా క్వాలిఫయర్ సెమీఫైనల్స్ మ్యాచుల్లో యూఏఈ పై నేపాల్ 8 వికెట్లతో, బహ్రెయిన్ పై 10 వికెట్ల తేడాతో ఒమన్ లు గెలుపొందాయి. యూఏఈ, నేపాల్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అరవింద్ (64) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యాన్ని నేపాల్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఆసీఫ్ షేక్ (64 నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Rohit Sharma : ఆ ఇద్దరూ చెబితేనే డీఆర్ఎస్‌కు వెళ్తా.. నేను దానిలో తలదూర్చను : రోహిత్ శర్మ
మొదట బ్యాటింగ్ చేసిన బహ్రెయిన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కశ్యప ప్రజాపతి, ప్రతిక్ అథవాలే బహ్రెయిన్ బౌలర్లపై చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ సారి 20 జట్లు.. ఎలాగంటే..?
యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఎలాగంటే.. గత టీ20 ప్రపంచకప్‌లో టాప్-8లో నిలిచిన ఇంగ్లాండ్, పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో పాటు అతిథ్య హోదాలో యూఎస్, వెస్టిండీస్ జట్లు మొత్తం కలిపి 10 నేరుగా అర్హత పొందాయి. వీటితో పాటు టీ20 ర్యాంకింగ్స్‌లో 9, 10 స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లు కూడా డైరెక్టుగా అర్హత పొందాయి. మిగిలిన ఎనిమిది స్థానాల కోసం రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీలను నిర్వహిస్తోంది. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, బమన్‌లు అర్హత సాధించగా.. మరో రెండు స్థానాలు ఈ నెలాఖరులో తేలిపోనున్నాయి.
SriLanka : ఫోన్ నంబర్లతో సరిపెట్టుకుంటున్న శ్రీలంక ఆటగాళ్లు.. ఇదేందీ సామి.. మరీ ఇలాగానా..!
The passion for cricket in Nepal is pure madness!
~ Nepal’s cricket team is among the luckiest globally, having such a loyal and devoted fan base! ???
#NepalCricket #NEPvUAE pic.twitter.com/ruAyYLPjjb
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 3, 2023